బిజినెస్

సంతృప్తికరంగా సేవల ఎంపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సేవా రంగానికి సంబంధించిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (ఎంపీఐ) గత ఆర్థిక సంవత్సరంలో సంతృప్తికరంగా ఉంది. 2018 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మాసం వరకూ పీఎంఐ సూచీలను పరిశీలిస్తే, సగటు యాభైకి తగ్గకపోవడం గమనార్హం. కొత్త ఆర్డర్లు, మొత్తం మీద ఆర్డర్ల జాబితా, ఉత్పత్తి, సరఫరా, ఉద్యోగిత అనే ఐదు అంశాల ఆధారంగా ఎంపీఐని నిర్ధారిస్తారు. గత ఏడాది మార్చిలో 50.3 పాయింట్లుగా ఉన్న ఎంపీఐ సూచీ ఈ ఏడాది మార్చిలో 52 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో 51.4, మేలో 49.6, జూన్‌లో 52.6, జూలైలో 54.2, ఆగస్టులో 51.5, సెప్టెంబర్‌లో 50.9, అక్టోబర్‌లో 52.2, నవంబర్‌లో 53.7, డిసెంబర్‌లో 53.2 పాయింట్లుగా ఎంపీఐ సూచీలు ఉన్నాయి. అదే విధంగా ఏడాది జనవరిలో 52.2, ఫిబ్రవరిలో 52.5, మార్చి మాసంలో 52 పాయింట్ల చొప్పున ఎంపీఐ సూచీలు నమోదయ్యాయి. సేవా రంగంలో భారత్ చాలా దేశాల కంటే చాలా ముందు ఉంది. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అదే విధంగా ఐటీ రంగంలో భారత్ సాంకేతిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదగడంతో, ఇక్కడి కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఆర్డర్లు భారీగా వచ్చిపడుతున్నాయి. కేవలం ఐటీ రంగంలోనేగాక, ఇతరత్రా సేవల రంగాల్లోనూ భారత కంపెనీలకు ఆర్డర్లు లభిస్తున్నాయి. మొత్తం మీద సేవల రంగం గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరంగానే కొనసాగింది. భవిష్యత్తు కూడా ఇదే తీరులో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.