బిజినెస్

కార్పొరేట్ల ఆదాయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం నుంచి మొదలయ్యే ముందున్న వారంలో ఊగిసలాట ధోరణి నెలకొనే అవకాశం ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో పాటు సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నందున కొంతమంది మదుపరులు లావాదేవీలకు దూరంగా ఉండే అవకాశం ఉందని, అందువల్ల మార్కెట్‌లో డోలాయమానం చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. రూపాయి కదలికలతో పాటు ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల రాకపోకలు కూడా మార్కెట్‌లో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వారు పేర్కొన్నారు. ‘ముందున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని ఎన్నికలే ప్రభావితం చేస్తాయి. ఎన్నికల ఫలితాలు రానున్న అయిదేళ్ల కాలంలో ద్రవ్య విధానం, స్థూలార్థిక విధానాలను నిర్దేశించనున్నాయి. అందువల్ల మదుపరులు ఈ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారిస్తారు’ అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునిల్ శర్మ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీనుంచి ఏడు దశలలో జరగనున్నాయి. కొంతమంది మదుపరులు ఈ ఎన్నికల సీజన్ ముగిసేంత వరకు ట్రేడింగ్‌కు దాదాపు దూరంగా ఉంటారని వారు చెప్పారు. అలాగే మదుపరులు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆదాయాలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తారని వారు తెలిపారు. ‘ఇన్ఫోసిస్, టీసీఎస్‌లతో కార్పొరేట్ కంపెనీల ఫలితాల విడుదల మొదలు కానుంది. ప్రపంచంలో టెక్నాలజి డిమాండ్ నిలకడపై మదుపరులకు స్పష్టత ఉంది’ అని శర్మ పేర్కొన్నారు. ఐటీ దిగ్గజాలయిన టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఈ నెల 12న త్రైమాసిక ఫలితాల విడుదల సీజన్‌ను ప్రారంభించనున్నాయి.
‘2018-19 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు దేశంలో కొనసాగుతున్న ఎన్నికలు ముందున్న వారంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయి’ అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు చెందిన పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చల పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ప్రపంచ వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు వాటి ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 2019 మార్చి నెలలో మంచి పనితీరును కనబరచిన అనేక లార్జ్ క్యాప్ స్టాక్‌లు ఏప్రిల్ నెలలో దిద్దుబాటుకు గురయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పీసీజీ రీసెర్చ్, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజి హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు.