బిజినెస్

అమెరికాలో విడుదలైన సన్ ఫార్మా కేన్సర్ ఇంజక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఔషధ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా తాజాగా కేన్సన్ ఇంజక్షన్‌ను అమెరికా మార్కెట్‌ల విడుదల చేసింది. ‘ఇన్‌ఫ్యూజెమ్’ పేరుతో తయారైన ఈ ఇంజక్షన్‌కు గత ఏడాది జూలైలోనే అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి పొందింది. నరాల ద్వారా ఇచ్చే ఇన్‌ఫ్యూజెమ్ ఇంజక్షన్ ఇక నుంచి అమెరికాలో కూడా లభిస్తుందని సన్ ఫార్మా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని సెబీ ఫైలింగ్‌లోనూ పేర్కొంది. కిమోథెరపీ ఉత్పత్తుల్లో, ముందుగానే మందుల సమ్మేళాన్ని పూర్తి చేసి, ఆతర్వాత మార్కెట్‌కు విడుదల చేసిన మొట్టమొదటి ఇంజక్షన్ తమదేనని తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి లభించిన తర్వాత, మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అవసరమైన స్టాక్‌ను సన్ ఫార్మా సిద్ధం చేసింది. బ్రెస్ట్, ఒవరియన్, నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్లలో ఈ ఔషధం అద్భుతంగా పని చేస్తుందని సన్ ఫార్మా తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ ఔషధాల సమ్మేళనంతో ఇన్‌ఫ్యూజెమ్‌ను తయారు చేసినట్టు తెలిపింది. కేన్సర్ చికిత్సలో ఇది కీలకంగా మారుతుందని ధీమా వ్యాక్తం చేసింది. ఇలావుంటే, సన్ ఫార్మా షేర్ ధర సోమవారం 0.09 శాతం పతనమై, 462.30 రూపాయలకు చేరింది.