బిజినెస్

అదాని చేతికి కోబ్రా వెస్ట్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆర్థికంగా నష్టపోయి, అప్పుల్లో కూరుకుపోయిన కోబ్రా వెస్ట్ పవర్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతిని అదానికి లభించింది. దీనితో కోబ్రా వెస్ట్ పవర్ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి అదానీకి మార్గం సుగమమైంది. కోబ్రా వెస్ట్ రుణదాతల కమిటీ ఇక్కడ సమమావేశమై, అదానీ బిడ్‌ను అంగీకరించింది. అదానికి లెటర్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఎల్‌ఓఐ)ని కూడా అందించింది. 2016లో కోబ్రా వెస్ట్ దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి చేరి, అక్కడ విచారణ కొనసాగింది. అప్పుల్లో కూరుకుపోయిన కోబ్రా వెస్ట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన అదాని పవర్ ఇచ్చిన ప్రతిపాదనపై వాదోపవాదలు జరిగాయి. చివరికి రుణదాతల కమిటీ అదాని పవర్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించింది. తీర్మానాన్ని ఆమోదించి, ఎల్‌ఓఐని కూడా జారీ చేసింది. దీనితో కోబ్రా పవర్‌పై హక్కులు అదానీ పవర్‌కు లభించాయి.