బిజినెస్

మహీంద్ర @ 1.5 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత ఆటో మొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని మహీంద్ర అండ్ మహీంద్ర మరోసారి నిరూపించుకుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మిన పికప్ వాహనాల సంఖ్య 1.5 లక్షల మైలురాయిని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చి మాసాంతానికి 1,62,000 పికప్ వాహనాలను అమ్మినట్టు మహీంద్ర అండ్ మహీంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,49,121 వాహనాలను అమ్మగా, గత ఆర్థిక సంవత్సరంలో 9 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించగలిగినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. బొలెరో మాక్సీ ట్రక్, బొలెరో పికప్, బొలెరో కాంపర్, ఇంపెరియో బ్రాండ్లతో మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ వాహనాలను తయారు చేస్తున్నది. భారత పికప్ వాహనాల సెక్టార్‌లో 58 శాతం ఈ కంపెనీ ఆధీనంలోనే ఉంది. లైట్ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్‌సీవీ) విభాగంలో 1.5 లక్షలకు మించి అమ్మకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ మైలురాయిని అధిగమించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందని మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం చీఫ్ విజయ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన మహా బొలెరో పికప్ 1.7టీ వాహనానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఎల్‌సీవీ సెగ్మెంట్‌లో, నెలకు సగటు సేల్స్ 14,000 వాహనాలుకాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.