బిజినెస్

ఎస్ బ్యాంక్‌తో వన్‌టైమ్ సెటిల్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎస్ బ్యాంక్‌తో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటామని ఆప్టో సర్క్యూట్స్ ఇండియా సంస్థ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ ఎస్ బ్యాంక్‌కు మొత్తం 33.51 కోట్ల రూపాయలు బకాయి పడింది. అయితే, ఆ మొత్తాన్ని తీర్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్న ఆప్టో సర్క్యూట్స్ 8.5 కోట్ల రూపాయలు చెల్లించి, వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు ముందుకొచ్చింది. ముందుగా నిర్దేశించిన వాయిదాల ప్రకారం, 2021 ఏప్రిల్‌లోగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఫైలింగ్‌లో వివరించింది. కాగా, మంగళవారం నాటి షేర్ మార్కెట్‌లో ఆ కంపెనీ వాటా ధర 2.92 శాతం పతనమై, 7.98 రూపాయలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రుణాల ను తిరిగి చెల్లించలేకపోతున్న ఆప్టో సర్క్యూట్స్ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది.