బిజినెస్

రెండు కంపెనీల నిరర్థక ఆస్తుల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రెండు కంపెనీలకు చెందిన నిరర్ధక ఖాతాల ఆస్తులు (ఎన్‌పీఏ)ను విక్రయించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆస్తుల పునర్వ్యవస్థీకృత కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ను ఆహ్వానించింది. ఈ నిరర్థక ఖాతాల ఆస్తుల విక్రయం ద్వారా దాదాపు రూ.423 కోట్ల రూపాయలు సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. కామాక్షి ఇండస్ట్రీస్, ఎస్‌ఎన్‌ఎస్ స్టార్చ్ కంపెనీలకు చెందిన ఈ ఎన్‌పీఏ ఖాతాల విక్రయానికిగాను ఈనెల 25న ఈ-వేలంపాట నిర్వహించనున్నారు. ‘ఆర్థిక ఆస్తుల విక్రయం విషయంలో బ్యాంకు విధానాన్ని అనుసరించి రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రాతిపదికగా ఈ ఖాతాల తాలూకు ఆస్తులను బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు (ఎఫ్‌ఐఎస్) తదితరాలకు విక్రయించడం జరుగుతుంద’ని ఎస్‌బీఐ తన తన ఈవోఐ ఆహ్వానంలో పేర్కొంది. ఉక్కు తయారీ పరిశ్రమ కామీక్షీ ఇండస్ట్రీస్ బ్యాంకు బకాయిలు రూ.364.80 కోట్లు ఉన్నాయని, అలాగే తయారీ, ఎగుమతుల సంస్థ ఎస్‌ఎన్‌ఎస్ స్టార్చ్ సైతం రూ.58.87 కోట్ల రూపాయలు బ్యాంకుకు బకాయిపడి ఉందని ఎస్‌బీఐ వివరించింది. కామాక్షి ఇండస్ట్రీస్ విక్రయానికిగాను ఆ కంపెనీ రిజర్వు ధరను రూ.165 కోట్లుగాను, ఎస్‌ఎన్‌ఎస్ స్టార్చ్ రిజర్వు ధరను రూ.36.56 కోట్లుగాను నిర్ణయించినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఆసక్తికలిగిన బ్యాంకులు, ఏఆర్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీ, ఎఫ్‌ఐలు ఈ ఆస్తుల తక్షణ కొనుగోలుకు సంబంధించిన అంగీకారాన్ని తెలియజేయాల్సిందిగా కోరింది. ఈఓఐని సమర్పించిన తర్వాత బ్యాంకుతో ‘వెల్లడించడానికి వీలులేని ఒప్పందం’ చేసుకోవాల్సి వుంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విక్రయం పూర్తిగా ధన ప్రాతిపదికనే జరుగుతుందని బ్యాంకు స్పష్టం చేసింది.