బిజినెస్

శ్రేయ్ బాండ్స్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కార్పొరేట్ అవసరాల కోసం 500 కోట్ల రూపాయల వరకూ నిధులను సమీకరించుకోవడానికి శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మంగళవారం బాండ్స్‌ను విడుదల చేసింది. బదిలీకి వీల్లేని డిబెంచర్లు (ఎన్‌సీడీ) రూపంలో జారీ చేసే బాండ్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకొక్కటి 1,000 రూపాయల ముఖ విలువగల బాండ్లను 100 కోట్ల రూపాయలు సేకరించేందుకు వీలుగా కంపెనీ జారీ చేసింది. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ కింద 400 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఈ బాండ్లపై ఏటా, అత్యధికంగా 10.75 శాతం చొప్పున పెట్టుబడిదారులకు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీలోని వాటాదారులందరికీ 0.25 శాతం అదనపు బోనస్‌ను ప్రకటించింది. రీటైల్ పెట్టుబడిదారులను ఉద్దేశించి ఈ బాండ్లను విడుదల చేసినట్టు వివరించింది. అంచనాలకు మించి భారీ డిమాండ్ వచ్చిందని పేర్కొంది.