బిజినెస్

జెట్ విమానం జప్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జెట్ ఎయిర్‌వేస్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థకు మరో సమస్య తలెత్తింది. బకాయిలు చెల్లించని కారణంగా జెట్ విమానాన్ని ఐరోపాకు చెందిన కార్గో సేవల సంస్థ జప్తు చేసింది. ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని సదరు కార్గో సంస్థ జప్తు చేసినట్టు ఇక్కడికి సమాచారం అందించింది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ముంబయికి రావాల్సిన బోయింగ్ 777-300 ఈఆర్ (వీటీ- జెఈడబ్ల్యూ)ను ఆమ్‌స్టర్‌డామ్‌లో నిలిపివేశామని, భారీ మొత్తంలో బకాయి లున్నా, వాటిని చెల్లించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐరోపా కు చెందిన కార్గో సంస్థ ప్రకటించింది. రుణాలు, ఇతరత్రా బకాయిలను చె ల్లించలేకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ పలు సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక, పెరుగుతున్న ఖ ర్చులకు, వస్తున్న రాబడికి ఏమాత్రం సమతూకం లేకపోవడంతో, గత 11 ఏళ్లలో 9 సంవత్సరాలు నష్టాలనే ఎదుర్కొంటున్నది. ఫలితంగా ఈ సంస్థ విమానాలు 123 నుంచి 25కు పడిపోయాయి. జెట్ ఎయిర్‌వేస్‌లో సుమారు 16,000 మంది పని చేస్తున్నారు. సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో, వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇలావుంటే, ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ముంబయికి రావాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల ఇంకా బయలుదేరలేదని జెట్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానాన్ని జప్తు చేసిన విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించలేదు.