బిజినెస్

స్వల్పంగా లాభపడిన సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప ఆధిక్యతనే నమోదు చేశాయి. రోజంతా అస్థిరత నడుమ ఊగిసలాడిన అనంతరం బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 21.66 పాయింట్ల ఆధిక్యతతో 0.06 శాతం లాభాలతో 38,607.01 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 12.40 పాయింట్లు ఎగబాకి 0.11 శాతం లాభాలతో 11,596.70 మార్కు వద్ద ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత అధికంగా 3.72 శాతం నష్టపోయింది. ఆక్సిస్ బ్యాంక్, సన్‌పార్మా, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టాటాస్టీల్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సైతం 1.46 శాతం నష్టాలను సంతరించుకున్నాయి.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఎన్‌పీటీసీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఆసియన్ పెయింట్స్ 2.19 శాతం లాభపడ్డాయి. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో విద్యుత్, టెలికాం, చమురు, సహజవాయువుల సూచీలు 1.11 శాతం ఆధిక్యతను నమోదు చేశాయి. అలాగే లోహ, ఐటీ, టెక్ సూచీలు 1.18 శాతం నష్టపోయాయి. కాగా గురువారం 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గల 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ఆరంభం కావడం మార్కెట్ మూడ్‌ను ప్రభావితం చేసిందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇలావుండగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈక్విటీ మార్కెట్లో బుధవారం 1,429.92 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఐఐలు) 461.29 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారని స్టాక్ ఎక్చేంజ్ ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఆసియన్ మార్కెట్లలో జపాన్, చైనా, కొరియా సూచీలు మిశ్రమ పలితాలను నమోదు చేయగా, ఐరోపాలో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ సూచీలు ఆరంభ సెషన్‌లో సానుకూల వాతావరణంలోనే కదులుతున్నాయి.
ఇలావుండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 0.44 శాతం తగ్గిపోయి బారెల్ 71.29 డాలర్ల వంతున ట్రేడైంది. డాలర్‌తో రూపాయి విలువ 11 పైసలు పెరిగి 69 రూపాయలకు చేరింది.