బిజినెస్

మెజెస్కోలో షేర్ల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: మధ్యతరహా ఐటీ సంస్థల్లో పేరున్న మాస్‌టెక్ సంస్థ బ్రిటిష్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం మెజెస్కోలో తనకు ఉన్న 12 శాతం వాటాలను అమ్మేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది చివరిలోగా అమ్మకాల ప్రక్రియ పూర్తికావాలన్న ధ్యేయంతో శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఒకప్పుడు మాస్‌టెక్‌కు అనుబంధ సం స్థగా మెజెస్కో ఉండేది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, ఆ కంపెనీలో మాస్‌టెక్ వాటా విలువ సు మారు రూ.130 కోట్లు. షేర్ల అమ్మకం ద్వారా వచ్చి న మొత్తాన్ని బ్రిటిష్ మార్కెట్‌లో ఆస్తులు లేదా వివి ధ సంస్థల కొనుగోళ్ల కోసం వెచ్చించాలని తీర్మానించింది. మాస్‌టెక్, మెజెస్కో ఒకప్పుడు ఒకటిగానే ఉన్నప్పటికీ, 2014లో విడిపోయా. అయితే, మెజెస్కోలో ఉన్న 12 శాతం వాటాలను మాస్‌టెక్ అమ్మలేదు. ప్రస్తుతం బ్రిటిష్ మార్కెట్ పెట్టుబడులకు అ నుకూలంగా ఉందని, అందుకే, అక్కడ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో లాభాలను ఆర్జించవచ్చని మాస్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఓవెన్ పీటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది తమ వ్యాపార ప్రణాళికలో కీలక వ్యూహమని పే ర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,000 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వే స్తున్నట్టు జాన్ చెప్పారు. బ్రిటన్ మార్కెట్‌లో ఎంపి క చేసుకున్న సంస్థల్లోనే పెట్టుబడులు పెడతామని అన్నారు. ప్రత్యేకించి భారత ఇంజనీరింగ్ వారసత్వాన్ని నిలబెట్టే కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఈ కంపెనీలో 2,100 మంది ఉద్యోగులు ఉన్నారు.