బిజినెస్

టెలికాం రంగంలో ఏకచత్రాధిపత్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారతీయ టెలికమ్యూనికేషన్ మార్కెట్ ప్రధానంగా మూడు ప్రైవేటు కంపెనీల ఆదర్శప్రాయమైన నిర్వహణతో, ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు సాగుతోందని వొడాఫోన్ ఐడియా సంయుక్త సంస్థ మంగళవారం నాడిక్కడ పేర్కొంది. దాదాపు రూ.25వేల కోట్ల మెగా నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న ఈ సంస్థ మార్కెట్‌లో ‘ఏకచత్రాధిపత్యం’, ధరల మాయ వంటివి జరుగుతున్నాయన్న విషయాన్ని తోసిపుచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎల్‌ఎన్ సహా మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు ప్రస్తుతం ఆదర్శవంతంగా నడుస్తున్నాయని, వీటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని వొడాఫోన్ ఐడి యా సీఈవో బాలేష్ శర్మ పీటీఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. టెలికాం సంస్థల మధ్య ఆధిపత్య పోరు సాగుతు న్నా అది ఆరోగ్యకరమైన స్థాయికే పరిమితమని పేర్కొన్నారు. తమ కంపెనీల విలీనం ద్వారా తాముసైతం పోటీకి సవాల్ విసురుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.