బిజినెస్

హోటల్ లీలావెంచర్ ఆస్తుల విక్రయంపై సెబీ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న హోటల్ లీలావెంచర్‌కు చెందిన ఆస్తుల విక్రయంపై మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ బుధవారం ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ నిర్వహించరాదని ఆదేశించింది. తమకు చెందిన నాలుగు హోటళ్లను, ఇతర ఆస్తులను కెనడాకు చెందిన పెట్టుబడుల సంస్థ ‘బ్రూక్‌ఫీల్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్‌కు’ విక్రయించడంపై సెబీ అభ్యంతరం వ్యక్తం చేసిందని లీలావెంచర్ యాజమాన్యం ఇక్కడ ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఉదయ్‌పూర్‌లలోని హోటళ్లతోబాటు, కొన్ని ఆస్తులను సైతం కెనడాకు చెందిన సంస్థకు మొత్తం రూ.3,950 కోట్లకు విక్రయించనున్నట్టు గత మార్చి 18న హోటల్ లీలావెంచర్ లి మిటెడ్ (హెచ్‌ఎల్‌వీఎల్) ప్రకటించింది. ఈ విషయంలో వాటాదారుల అభిప్రాయాలను సంస్థ తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఈనెల 24న జరగాల్సివుంది. ఈ క్రమంలో ది సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్పందించి లీలావెంచర్ యాజమాన్యానికి లేఖ రాసింది. తమకు ఐటీసీ నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని జాతీ య న్యాయ ట్రిబ్యునల్‌కు పంపడం జరిగిందని, పలు అవకతవకలకు చెందిన ఆరోపణలు అందు లో ఉన్నాయని, అలాగే మైనారిటీ షెర్‌హోల్డర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి సైతం ఫిర్యాదులు ఉన్నాయని, ఐటీసీ హోటల్‌తోబాటు దాని ప్రమోటర్స్, జెఎమ్ ఫైనాన్షియల్ ఆస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీపై సైతం ఆరోపణలు వచ్చాయని, అలా గే పోస్టల్ బ్యాలెట్ విధానంపై సైతం అభ్యంతరాలున్నాయని ఆ లేఖలో సెబీ పేర్కొంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ, ప్రధానంగా ఆర్థిక లా వాదేవీలను నిలిపి ఉంచాలని సెబీ ఆదేశించింది.