బిజినెస్

టెలికాం రంగంలో ఒడాఐడియా నెం1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో శరవేగంగా దూసుకెళుతున్నప్పటికీ, ఒడాఫోన్, ఐడియా ఒకే కంపెనీగా అవతరించడంతో, ఎక్కువ శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి వైర్‌లెస్ వినియోగదారులు గ్రామీణ ప్రాంతంలో 527.77 మిలియన్ల మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 654.20 మంది ఉన్నారు. మొత్తం వీరి సంఖ్య 1,181.97. ఫిబ్రవరి మాసాంతంలో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులను చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 527.11, పట్టణాల్లో 656.57 (మొత్తం 1,183.68) మిలియన్ల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక మొత్తంగా టెలికాం వినియోగదారుల విషయానికి వస్తే, ఈ ఏడాది జనవరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 530.86 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 672.91 మిలియన్లు (మొత్తం 1,203.77 మిలియన్లు) మంది ఖాతాదారులున్నారు. ఫిబ్రవరిలో కొంత మేర పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 530.16 మిలియన్లు, పట్టణాల్లో 675.24 మిలియన్లు (మొత్తం 1,205.40 మిలియన్లు)గా మొత్తం ఖాతాదారుల సంఖ్య కనిపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన టెలికాం మార్కెట్‌ను కలిగి ఉన్న భారత్‌లో, అత్యధిక వాటా వొడాఐడియా సొంతం చేసుకుంది. ప్రస్తుత టెలికాం మార్కెట్‌లో ఆ కంపెనీకి 34.58 శాతం వాటా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ 28.75 శాతం వాటాతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, రిలయన్స్ జియో 25.11 శాతం వాటాతో మూడో స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు టెలికాం రంగంపై ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 9.82 శాతం మార్కెట్ వాటాకు పరిమితమైంది. టాటా 1.44 శాతం, ఎంటీఎన్‌ఎల్ 0.29 శాతం, రిలయన్స్ 0.002 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్థూలంగా చూస్తే, టెలికాం రంగంలో ప్రైవేటు కంపెనీలు 89.88 శాతాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. దీనితో ప్రభుత్వ సంస్థల వాటా 18.12 శాతానికి కుచించుకుపోయింది. ఏ టెలికాం కంపెనీకైనా వౌలిక సదుపాయల సమకూరుస్తూ, దేశం మొత్తం మీద అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు మూసివేత దిశగా అడుగులు వేయడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తునే ఉంది.
అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, ఖాతాదారుల పట్ల గౌరవ భావం లేకపోవడంతోపాటు ప్రైవేటు కంపెనీలకు దీటుగా వ్యూహరచన చేయలేకపోవడం కూడా బీఎస్‌ఎన్‌ఎల్ పతనానికి కారణాలవుతున్నాయి.