బిజినెస్

అదానీకి భారీ కాంట్రాక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, బొగ్గు గనులు, నగర ప్రజల వంట గ్యాస్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ కాంట్రాక్టులను బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని ‘అదానీ గ్రూప్’ సంస్థ తాజాగా హస్తగతం చేసుకుంది. ఇందులో జాతీయ రహదారి నిర్మాణాలు సైతం ఉన్నాయి. కొత్త రంగాల్లోకి సైతం అడుగిడాలన్న లక్ష్యం మేరకు ఈ సంస్థ ముందుకెళుతోందని విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా లాజిస్టిక్స్, గనులు, విద్యుత్, నిర్మాణ, వ్యవసాయోత్పత్తులపై ఈ సంస్థ ప్రస్తుతం తన వాణిజ్య దృష్టిని ప్రత్యేకంగా కేటాయించి సంబంధిత వేలం లేదా టెండర్లలో అధికంగా పాల్గొనడం జరుగుతోంది. దేశంలోని సుమారు ఆరు విమానాశ్రయాలకు సంబంధించిన హక్కులు వచ్చే 50 సంవత్సరాలకు హస్తగతం చేసుకునేందుకు గత ఫిబ్రవరిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధిక ప్రీ ప్యాసింజర్ ఫీజును విమానాశ్రయాల అధికారులకు చెల్లించేలా అధిక మొత్తానికి బిడ్ వేయడం జరిగింది. అలాగే బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్టులను సైతం ఏడాదికి 64 మిలియన్ టన్నుల ఉత్పత్తిపై చేజిక్కించుకోవడం జరిగింది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం 2,623 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను కైవసం చేసుకుంది. అంతేగాక 1,547 మెగావాట్ల గాలి మరల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ఇక 390 మెగావాట్ల హైడల్ విద్యుత్ ప్రాజెక్టులను రివర్స్ వేలం బిడ్ ద్వారా చేజిక్కించుకుంది. ఇక సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు అనేకం దక్కాయి. అదానీ గ్యాస్ ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరా, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలు, హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుర్జా ప్రాంతాల్లో 1,300 పరిశ్రమలకు, సుమారు 4 లక్షల మంది గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు లైసెన్స్‌ను పొందింది. గత నవంబర్‌లో 13 ప్రధాన నగరాల్లో సీఎన్‌జీ, ఆటోమొబైల్స్, పైప్‌లతో కూడిన వంట గ్యాస్ సరఫరాకు హక్కులు పొందింది. తొమ్మిది ప్రాంతాల్లో ఐఓసీతో సంయుక్త వెంచర్‌కు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మరో రెండు గ్యాస్ ఏజెన్సీలకు గత నెలలో బిడ్ వేయడం జరిగింది.
చత్తీస్‌గఢ్‌లో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి గత సంవత్సరం ఏప్రిల్‌లో, తెలంగాణలో గత నెలలో కాంట్రాక్టులను అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది.