బిజినెస్

ఎస్ బ్యాంక్ ప్రక్షాళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 28: ఎస్ బ్యాంక్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. బ్యాంక్‌ను నష్టాల బాట నుంచి తప్పించడమేగాక, ఆర్బీఐ నిబంధనలకు అనుకూలంగా విధివిధానాలను నిర్ధారించడం కూడా అత్యంత కీలకమని కొత్త చీఫ్ ఎగ్జికూటివ్ ఆఫీసర్ (సీఈవో) రవ్‌నీత్ గిల్ నిర్ణయించారు. ముందుగా నష్టాలకు కారణాలను ఆయన అనే్వషిస్తున్నారు. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల్లో ఎస్ బ్యాంక్‌ది ఐదో స్థానం. ఎప్పుడూ లాభాలను ఆర్జించే ఈ సంస్థ గత వారం ప్రకటించిన నివేదికలో 1,506 కోట్ల రూపాయల నష్టాన్ని చూపించింది. బ్యాంక్ నష్టాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అంతేగాక, నియమనిబంధనలను సక్రమంగా అమలు చేయడం లేదంటూ ఆర్బీఐ తీవ్రంగా మందలించింది. చర్యలకు కూడా ఉపక్రమించింది. దీనితో సీఈఓగా ఉన్న రాణా కపూర్‌ను తొలగించిన బ్యాంక్ పాలక మండలి ఆ స్థానంలో రవ్‌నీత్‌ను నియమించింది. మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టానికి కారణాలను పసిగట్టాలని రవ్‌నీత్ తీర్మానించుకున్నారు. అదే సమయంలో, ఏఏ అంశాలు లేదా విభాగాల్లో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. పై నుంచి కింది స్థాయి వరకూ ప్రక్షాళన జరగాల్సిందేనని ఆయన అభిప్రాయం. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ను ఏ విధంగా నష్టాల నుంచి బయటపడేయాలన్న లక్ష్యంతో ఆయన తన చర్యలను మొదలుపెట్టారు.