బిజినెస్

యూఎస్ నుంచి ఔషధాలు వెనక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా అమెరికా నుంచి కొన్ని ఔషధాలను డాక్టర్ రెడ్డీస్, సిప్లా కంపెనీలు వెనక్కు తెప్పించుకుంటున్నాయి. మూర్ఛ, మైగ్రేన్ తలనొప్పి వంటి వ్యాధులను నయం చేయడానికి వాడే డివాల్‌ప్రొయెక్స్ సోడియం ఎక్స్‌టెండెండ్ రిలీస్ టాబ్లెట్లు ఉన్న 33,958 బాటిళ్లను అమెరికా మార్కెట్ నుంచి తెప్పిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ముంబయి కేంద్రంగా ఉన్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లాకు అనుబంధంగా సంస్థ ఇవాజెన్ ఫార్మాస్యూటికల్స్ అమెరికా నుంచి 7.8 లక్షల టెస్టోస్టెరోన్ సైపియోనేట్ ఇంజక్షన్ వాయిల్స్‌ను తిరిగి తెప్పిస్తున్నది. అమెరికాలోని ఉత్తమ ఉత్పత్తి విధానం (సీజీఎంపీ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ఔషధాలను మార్కెట్ నుంచి తొలగించాల్సిందేనని అమెరికా చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) కూడా నాణ్యతా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఏమాత్రం లోపం కనిపించినా, సదరు ఔషధం మొత్తం బ్యాచ్‌నే మార్కెట్ నుంచి తీసేయాల్సిందిగా ఆదేశిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే డాక్టర్ రెడ్డీస్, సిప్లా కంపెనీలు తమతమ ఉత్పత్తుల్లోని కొన్ని రకాల ఔషధాలను వెనక్కు తెప్పించుకుంటున్నాయి.