బిజినెస్

గోధుమపై పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: గోధుమ దిగుమతులపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. దిగుమతులను సాధ్యమైనంత వరకూ తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక గోధుమ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలంటే, దిగుమతులను తగ్గించాలనే సూత్రాన్ని కేంద్ర సర్కారు అనుసరిస్తున్నది. పైగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోధుమ ఉత్పత్తి జరిగింది. కాబట్టి, గోధుమ కొరత ఉండదు. దేశీయ ఉత్పత్తిదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో తెలిపింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం పెంచడంతో, 40 శాతానికి చేరిందని వివరించింది. గత ఏడాది మార్చిలో 20 శాతంగా ఉన్న సుంకాన్ని సీబీఐసీ 30 శాతానికి పెంచింది. కాగా, గోధుమకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని క్వింటల్‌కు 1,840 రూపాయలుగా కేంద్రం నిర్ధారించింది. గత ఏడాది ఇది 1,735 రూపాయలు. ఉత్పత్తి ఖర్చుకు 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది గోధుమ మంట 100 మిలియన్ టన్నులుగా ఉంటుందని కేంద్రం అంచనా. గతంలో ఎన్నడూ ఇంత అధికంగా గోధుమ దిగుమతి జరగలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరం జూన్, జూలై మాసాల్లో 99.70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది. ఆ రికార్డును ఈ ఏడాది ఉత్పత్తి అధిగమిస్తుందని, 100 మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమిస్తుందని అధికారులు అంటున్నారు.