బిజినెస్

రూ. 54,152 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మార్కెట్ కేపిటలైజేషన్ (ఎంక్యాప్)లో అతివిలువైన టాప్‌టెన్ కంపెనీల జాబితాలోని ఎనిమిది కంపెనీలు గతవారం రూ. 54,151.62 కోట్ల విలువను అదనంగా పెంచుకున్నాయి, ఇందులో సింహ భాగాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంతరించుకోవడం గమనార్హం. మార్కెట్ విలువలో టాప్‌టెన్ కంపెనీల్లో ఈ వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే నష్టపోయాయి. గత శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారం గణాంకాలు పరిశీలిస్తే టీసీఎస్ రూ. 34,822.13 కోట్ల అదనపుమార్కెట్ విలువను సంతరించుకుని మొత్తం విలువ రూ. 8,39,896.27 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ సైతం రూ. 9,043.69 కోట్లు అదనపు విలువను కూడగట్టుకోగా మొత్తం విలువ 3,22,033.94 కోట్లకు, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఎంక్యాప్ సైతం 5,419.63 కోట్లు అదనంగా పెరిగి మొత్తం విలువ రూ. 8,82,005.44 కోట్లకు చేరగా, ఐసీఐసీఐ బ్యాంకు విలువ 1,627.51 కోట్లు అదనంగా పెరిగి మొత్తం విలువ రూ. 2,62,645.88 కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యూని లీవర్ (హెచ్‌యూఎల్) విలువ అదనంగా 1,363 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం విలువ రూ. 3,77,470.33 కోట్లకు చేరింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విలువ రూ. 1,249.45 కోట్లు పెరిగి మొత్తం విలువ రూ.2,78,715.62 కోట్లకు, ఐటీసీ విలువ రూ. 367.76 కోట్లు అదనంగా పెరిగి రూ. 3,73,459.21 కోట్లకు, కోటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ విలువ రూ. 257.69 కోట్లు పెరిగి మొత్తం విలువ రూ. 2,63,047.09 కోట్లకు చేరుకుంది. కాగా ఈ పోటీలో హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ. 3,662.39 కోట్లమేర తగ్గిపోగా మొత్తం విలువ రూ. 3,39.906.42 కోట్లకు దిగివచ్చింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలువ సైతం రూ. 3,662.39 కోట్లమేర తగ్గిపోయి మొత్తం విలువ రూ. 6,20,015.67 కోట్లకు దిగువకు చేరుకుంది.
ర్యాంకింగ్‌లు ఇలా..
గడచిన వారం వాణిజ్య స్థితిగతులను బేరీజువేసుకుని వివిధ కంపెనీలకు టాప్ టెన్ ర్యాంకింగ్‌లు వచ్చాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వరుసగా తదుపరి ర్యాంకులను దక్కించుకున్నాయి. గడచిన వారం రోజుల్లో సెనె్సక్స్ మొత్తం 72 పాయింట్లు కోల్పోయి 0.18 శాతం నష్టంతో 39,067.33 వద్ద స్థిరపడింది.