బిజినెస్

ఇక జీఎస్టీ ‘ఈ-ఇన్వాయిస్‌లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నిర్ణీత స్థాయికన్నా అధిక టర్నోవర్‌తో జరిగే వ్యాపాల్లో ప్రతి విక్రయానికి సంబంధించి ‘ఈ ఇన్వాయిస్’ను ప్రభుత్వ జీఎస్టీ పోర్టల్ ద్వారా అందజేసేందుకు ఓ ప్రత్యేక సిస్టంను రూపొందించేందుకు జీఎస్టీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిద్వారా జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు అధిక టర్నోవర్‌తో నడిచే వ్యాపారాలకు ఓ యూనిక్ నంబర్‌ను ప్రతి ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ లేదా ఇ ఇన్వాయిస్ జారీకి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ యూనిక్ నంబర్ ఇన్వాయిస్‌తో ఎప్పుడు పోల్చిచూసినా సెల్స్ రిటర్న్‌లు, పన్ను చెల్లింపులతో సరిపోలుతుందని అధికారులు తెలిపారు. పూర్తి విక్రయ విలువతో కూడుకున్న పూర్తి ఎలక్ట్రానిక్ టాక్స్ ఇన్వాయిస్ లేదా ఈ ఇన్వాయిస్‌ను వ్యాపారులు ఖచ్చితంగా రికార్డు చేయాల్సిన ఉంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వ్యాపారికి కేటాయిస్తారు. దీన్ని జీఎస్టీతో లేదా ప్రభుత్వ పోర్టల్‌తో అనుసంధానం చేస్తారు. దీనిద్వారా ఈ ఇన్వాయిస్‌లు జనరేట్ అవుతాయని ఆ అధికారి వివరించారు.