బిజినెస్

భారత్ వాణిజ్య బంధంపై ట్రంప్ అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పేపర్ ఉత్పత్తులు, ప్రతిష్టాత్మకమైన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు భారత్ అధిక సుంకాలు (టారిఫ్‌లు) వసూలు చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు విమర్శలు గుప్పించారు. భారత్‌తోబాటు చైనా, జపాన్ వంటి దేశాల ఇలాంటి వైఖరి వల్ల అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. విస్కాన్సిన్ రాష్ట్రం గ్రీన్ బే సిటీలో ఆదివారం జరిగిన రిపబ్లికన్ పార్టీ రాజకీయ ర్యాలీలో ప్రసంగిస్తూ ట్రంప్ పై విమర్శలు చేశారు. కొన్ని సంవత్సరాలుగాప్రతిదేశం అమెరికాను భరించలేని విధంగా మోసం చేస్తోందన్నారు. ఈ విషయంలో భారత్‌ను ‘్ధరల రాజు’గా ఆయన మరోమారు అభివర్ణించారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను భారత్ అమలు చేస్తోందన్నారు. అనేక దశాబ్దాలుగా అమెరికా ఇలా పదులు, వందలు, బిలియన్ల డాలర్ల మేర చైనా, జపాన్, భారత్‌లతోబాటు అన్ని దేశాల వల్ల నష్టపోవడం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా నష్టపోవడం జరగదని ప్రజల హర్షద్వానాల మధ్య ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికన్ పేపర్ ఉత్పత్తుల ఎగుమతులపై ఇతర దేశాలు అధిక సుంకాలను వసూలు చేస్తున్నాయి. మనం మాత్రం విదేశీ పేపర్ ఉత్పత్తుల దిగుమతులపై ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేద’ని ట్రంప్ పేర్కొన్నారు. ప్రత్యేకించి విస్కాన్సిన్ పేపర్ కంపెనీలు విదేశాలకు ఉత్పతులను ఎగుమతి చేయాలంటే చైనా, భారత్, వియత్నాం వంటి దేశాలు అధిక సుంకాలను వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుతున్నారని, అలాంటి వినూత్న వాణిజ్య విధానానే్న భారత్, చైనా, జపాన్ వంటి దేశాలతో తాము అనుసరిస్తున్నామని ఈవిధానాన్ని త్వరలో వైట్ హౌస్ సైతం ఆమోదిస్తుందని విశ్వసిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇలావుండగా ఈ ఏడాది ఆరంభంలో వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ హెర్లీ డేవిడ్‌సన్ బైక్‌ల దిగుమతిపై సుకాన్ని 100 నుంచి 50 శాతానికి తగ్గించిన భారత్ వైఖరిపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పన్నుల విషయంలో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరిస్తాయని ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో భారత ప్రధాని మోదీతో సైతం తాను మాట్లాడానని, మూడేళ్ల క్రితం తాను మోదీని కలిసినప్పుడు కూడా తమ మధ్య దీనిపై చర్చ జరిగిందని అన్నారు. దీనిపై స్పందించిన మోదీ 50 శాతం సుకాన్ని తగ్గించారని తెలిపారు. ఐతే తాజాగా ట్రంప్ దీనిపై మాట్లాడుతూ 50 శాతం సుకం కూడా అధికమేనని వ్యాఖ్యానించారు. కాగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఇనుము, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలను వసూలు చేస్తోందని, దీన్ని తగ్గించాలని ఇటీవల భారత్ వత్తిడి తెస్తోంది. అలాగే జనరల్ సిస్టం ఆఫ్ ప్రిఫరెనె్సస్ (జీఎస్పీ) పథకం ద్వారా వ్యవసాయ, ఆటోమొబైల్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, ఇంజనీరింగ్ రంగానికి చెందిన ఉత్పత్తుల ఎగుమతులపై రాయితీలు (ఎక్స్‌పోర్ట్ బెనిఫిట్స్) కల్పించాలని భారత్ కోరుతోంది. అలాగే అమెరికా సైతం వ్యవసాయ పరికరాలు, పాల ఉత్పత్తులు, ఔషధ సంబంధ పరికరాలు, ఐటీ, సమాచార సంబంధిత పరికాలపై ఉన్న అధిక సుంకాలను తగ్గించాలని కోరుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 47.9 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, 26.7 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి.