బిజినెస్

మార్కెట్ విలువలో రిలయన్స్ ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: అత్యధిక మార్కెట్ విలువగల భారతీయ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ విలువ 5,420 కోట్లు పెరగడంతో, 8,82,005 కోట్ల రూపాయలకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ 3,482 కోట్లు పెరిగి, 8,39,896 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదే విధంగా మార్కెట్ విలువ ఆధారంగా ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచిన కంపెనీల్లో హిందుస్థాన్ యూనీ లీవర్ (3,77,470 కోట్లు), ఐటీసీ (3,77,459 కోట్లు), ఇన్ఫోసిస్ (3,22,034 కోట్లు), ఎస్‌బీఐ (2,78,716 కోట్లు), కోటక్ బ్యాంక్ (2,63,047 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (2,62,646 కోట్ల రూపాయలు) ఉన్నాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3,662 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినప్పటికీ, మార్కెట్ విలువ 6,20,016 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ సైతం 5,052 కోట్ల రూపాయలు నష్టపోగా, దాని మార్కెట్ విలువ 3,39,906 కోట్ల రూపాయలకు పడిపోయింది.