బిజినెస్

సోలార్ ప్రాజెక్ట్ బిడ్స్‌కు గడుపు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సోలార్ ప్రాజెక్ట్ కోసం బిడ్స్ వేసే గడువును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) పొడిగించింది. 97.5 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్టు కోసం బిడ్స్ వేయడానికి మంగళవారాన్ని చివరి తేదీగా తొలుత ప్రకటించింది. అయితే, బిడ్డర్ల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరగలేదని, అందుకే, గడువును మే 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ పొడిగించామని ఎస్‌ఈసీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 22వ తేదీ ఉదయం 11 గంటలకు బిడ్స్‌ను తెరుస్తామని పేర్కొంది. రూఫ్ టాప్‌తో అనుసంధానమైన 97.5 మెగావాట్ పీక్ (ఎండబ్ల్యూపీ) సామర్థంగల గ్రిడ్ ఏర్పాటుకు ఎస్‌ఈసీఐ ఫిబ్రవరి 26వ తేదీన బిడ్స్‌ను ఆహ్వానించింది. మార్చి ఏడో తేదీన ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించింది. అందులో కొంత మంది బిడ్డర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరణలు ఇవ్వలేకపోయినందుకు, బిడ్స్ తేదీని పొడిగించింది. ఈ విధంగా రెండుసార్లు వాయిదా పడిన బిడ్స్ సమర్పణ గడువు ముచ్చటగా మూడోసారి, మే 21వ తేదీకి చేరింది.