బిజినెస్

మార్చిలో 1 శాతం తగ్గిన ఉక్కు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మనదేశ ముడి ఇనుము (ఉక్కు) ఉత్పత్తిలో గడచిన మార్చి నెలలో దాదాపు ఒక శాతం మేర తగ్గుదల నమోదైంది. ఆ ఏడాది మొత్తం 9,412 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగిందని ప్రపంచ ఉక్కు పరిశ్రమల సంఘం నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో దేశీయంగా 9,506 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. గత జనవరి నుంచి మనదేశంలో ఇలా ఉత్పత్తిలో తగ్గుదల నమోదవడం రెండోసారి. గత ఫిబ్రవరిలో 2.3 శాతం ఉత్పత్తి ఆధిక్యత నమోదుకాగా అంతకు ముందు జనవరిలో 1.9 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా గత మార్చిలో 155 మిలియన్ టన్నుల ఉక్కును సంబంధిత కర్మాగారాలు తయారు చేశాయి. 2018లో ఇదే కాలంలో జరిగిన 147.71 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 4.9 శాతం అధికం. చైనా 80.326 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో 10 శాతం ఆధిక్యతను నమోదు చేయగా, జపాన్ లో మాత్రం ఈ ఉత్పత్తిలో ఎలాంటి తేడా కనిపించలేదు. అక్కడ 9.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇక అమెరికా 7.8 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 5.7 శాతం ఆధిక్యతను, దక్షిణ కొరియా 6.3 మిలియన్ టన్నులతో 2.8 శాతం ఆధిక్యతను నమోదు చేశాయి. ఇక ఇటలీ, ఐరోపా దేశాలు 2.3 మిలియన్ టన్నులు, స్పెయిన్ 1.4 మిలియన్ టన్నులు, ఉక్రెయిన్ 2 మిలియన్ టన్నులు, బ్రెజిల్, టర్కీలు 2.8 మెట్రిక్ టన్నుల వంతున ఉత్పత్తి చేశాయని నివేదిక గణాంకాలు వెల్లడించాయి.