బిజినెస్

తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: బులియన్ మార్కెట్ గురువారం నష్టాల్లో నడిచింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 250 రూపాయలు తగ్గి, 32,620 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 825 రూపాయలు పతనం కావడంతో, 37,700 రూపాయలుగా స్థిరపడింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ బులియన్ మార్కె ట్ల సూచీలు కూడా ప్రతికూలంగా ఉండడం వంటి అంశాలే బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణమని అంటున్నారు. దేశీయ మదుపరులు కూడా ఆసక్తిని ప్రదర్శించకపోవడం బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం సైతం భారత బులియన్ మార్కెట్ నష్టాలకు కారణమైంది. ఆర్థిక లావాదేవీలు స్థిరంగా కొనసాగుతాయని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్ బలహీనంగా ఉందని, ఆర్థిక మాంద్యంలో చెప్పుకోదగ్గ తేడాలు ఉండవని తెలిపింది. ఈ కారణంగానే భారీ మార్పులు, అనూహ్య ఫలితాలు నమోదు కావని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులు స్థిరంగా ఉన్నంత కాలం, బులియన్ మార్కెట్‌కు నష్టాలు తప్పవన్నది వాస్తవం. అంతర్జాతీయ సూచీలు పతనమైనప్పటికీ, అనేకానేక సందర్భాల్లో దేశీయ మదుపరుల నుంచి వచ్చిన డిమాండ్‌తో భారత బులియన్ మార్కెట్ నష్టాల నుంచి గట్టెక్కింది. కానీ, గురువారం దేశీయంగా కూడా డిమాండ్ కనిపించలేదు. అయి తే, ఈ నష్టం తాత్కాలికమేనని, అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, భారత బులియన్ మార్కెట్ లాభాలు ఆర్జించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మార్కెట్ విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో మార్కెట్ మళ్లీ తేరుకొని, పూర్వ వైభవాన్ని కొనసాగిస్తుందని అంటున్నారు.