బిజినెస్

మళ్లీ గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: బాదం, వాల్నట్, పప్పు ధన్యాలుసహా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 29 ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచేందుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ నిర్ణయం అమలును ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గత ఏడాది జూన్ మాసంలో, 29 అమెరికా ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రకటించింది. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. కాగా, వివిధ అంశాలు దృష్టిలో ఉంచుకొని, ఎక్సైజ్ సుంకాన్ని పెంచే ఆలోచనను కేంద్రం పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఇంతకు ముందు చేసిన ప్రకటనను అనుసరించి, కొత్త పన్నులను ఈనెల రెండో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు భారత సర్కారు ప్రకటించింది. ఈ నిర్ణయం అమలు మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యం లేదు. ఈనెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈలోగా కేంద్రం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు.