బిజినెస్

స్పైస్‌జెట్ నుంచి మరో 12 సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: స్పైస్‌జెట్ కొత్తగా మరో 12 విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ముంబయి, న్యూఢిల్లీ నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులు ఈనెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఆరు విమానాలు న్యూఢిల్లీ నుంచి, మరో ఆరు ముంబయి నుంచి నడుస్తాయని వివరించింది. ఈ మార్గాల్లో బోయింగ్ 737 ఎన్‌జీ విమానాలను నడిపిస్తుంది. ఢిల్లీ-విశాఖపట్నం, ఢిల్లీ కొచ్చి నగరాలకు కొత్త సర్వీసులను స్పైస్‌జెట్ ప్రారంభిస్తున్నది. అదే విధంగా ముంబయి-బెంగళూరు మార్గంలో ఐదో డైలీ సర్వీసును మొదలుపెడుతున్నది. గత మాసంతో మొదలుపెడితే, ఇప్పటి వరకూ స్పైస్‌జెట్ 77 కొత్త విమానాలను తన ఫ్లీట్‌లో చేర్చడం విశేషం. కాగా, స్పైస్‌జెట్ ముంబయ నుంచి హాంకాంగ్, జెద్దా, దుబాయ్, కొలంబో, ఢాకా, రియాద్, ఖట్మండూ నగరాలకు కొత్త అంతర్జాతీయ సర్వీసులను మొలుపెట్టనున్నట్టు ప్రకటించింది.