బిజినెస్

స్క్వేర్ యార్డ్స్ లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: ప్రాపర్టీ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న స్క్వేర్ యార్డ్స్ సంస్థ లాభాల పంట పండిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం 38 శాతం వృద్ధి రేటును సాధించినట్టు కంపెనీ శుక్రవారం సెబీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అమ్మకాలు, ఫీ ద్వారా వచ్చిన ఆదాయం 220 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. ఈ సంస్థ ఖాతాదారుల్లో ప్రవాస భారతీయులు ఎక్కువ. వారు స్వదేశంలో ఇళ్లు లేదా వ్యవసాయ, వాణిజ్య భూములను కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని రకాల సేవలను స్క్వేర్ యార్డ్స్ సంస్థ అందిస్తున్నది. అదే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలను పొందేందుకు కూడా వారి తరఫున అన్ని లాంఛనాలను పూర్తి చేస్తున్నది. రియాల్టీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, స్క్వేర్ యార్డ్స్‌కు ఖాతాదారులు పెరుగుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 160 కోట్ల రూపాయలను ఆర్జించిన ఈ కంపెనీ, గత ఆర్థిక సంవత్సరంలో 220 కోట్ల రూపాయలకు ఎదిగింది. కంపెనీ ఆదాయంలో ఎక్కువగా, 70 శాతం మొత్తాన్ని భారత దేశంలో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా సంపాదించింది. విదేశాల్లో ప్రాపర్టీ బ్రోకరేజ్ 20 శాతంగా ఉంది. మిగతా 10 శాతం ఆదాయం మార్టిగేజ్ వ్యాపారం నుంచి లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు, ఇంటి రుణాలుసహా ఈ కంపెనీ మొత్తం 11,508 లావాదేవీలను జరిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల సంఖ్య 11,299 మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే లావాదేవీలను జరపగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో వాటి విలువ 4,302 కోట్ల రూపాయలు. భారత దేశంలో ఆస్తులను కొనడానికి విదేశీయులు, ప్రత్యేకించి ప్రవాస భారతీయులు ఆసక్తిని ప్రదర్శిస్తున్న కారణంగా స్క్వేర్ యార్డ్స్ కంపెనీ లాభాల బాటలో దూసుకెళుతున్నది.