బిజినెస్

చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్రమైన ఆటుపోట్ల మధ్య కొనసాగింది. చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, స్వల్ప నష్టం తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ లాభాల్లోనే మొదలైంది. దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో ఒకానొక దశలో సెనె్సక్స్ 39,172.76 పాయింట్ల వరకూ చేరింది. కానీ, అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా నమోదు కావడంతో, దాని ప్రభావం బీఎస్‌ఈ ట్రేడింగ్‌పైన కూడా పడింది. దీనితో ఇన్‌ట్రా డేలో, ఒకదశలో సెనె్సక్స్ అత్యల్పంగా 38,920.17 పాయింట్లకు పడిపోయింది. చివరి క్షణాల్లో షేర్ల అమ్మకాలకు మదుపరులు పట్టుబట్టడంతో నష్టాలు తప్పలేదు. అయితే, దేశీయ పెట్టుబడిదారులు ఆదుకోవడంతో, సెనె్సక్స్ 18.17 పాయింట్లు (0.05 శాతం) స్వల్ప నష్టంతో బయటపడింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 12.50 పాయింట్లు (0.11 శాతం) పతనమై, 11,712.25 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈలో టీసీఎస్ (3.70 శాతం), హెచ్‌యూఎల్ (2.70 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (1.40 శాతం), టాటా స్టీల్ (1.31 శాతం), ఇన్ఫోసిస్ (0.84 శాతం) షేర్లు నష్టాలను చవిచూశాయి. అదే విధంగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీ, వేదాంతా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐటీ దిగ్గజం కాంగ్నిజెంట్ గత ఆర్థిక సంవత్సర ఫలితాలను వెల్లడించిన తర్వాత ఐటీ స్టాక్స్ ధరలు పతనమయ్యాయి. వృద్ధిరేటు 7 నుంచి 9 శాతం వరకూ ఉంటుందని కాంగ్నిజెంట్ ఇటీవలే ప్రకటించింది. అయితే, ఆర్థిక నివేదికలో ఈ ఏడాది 3.6 నుంచి 5.1 శాతం మధ్య వృద్ధిరేటు ఉండవచ్చని అంచనా వేసింది. సుమారు నెల రోజుల వ్యవధిలోనే వృద్ధిరేటును తగ్గించడం కేవలం ఆ కంపెనీపైనేగాక, మొత్తం ఐటీ కంపెనీలపై ప్రభావం చూపింది. రూపాయి మారకపు విలువ బలపడకపోవడం కూడా స్టాక్ మార్కెట్‌ను శాసించింది. అయితే, ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొన్న భారతి ఎయిర్‌టెల్ (3.11 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.84 శాతం), ఎన్‌టీపీసీ (1.13 శాతం), టాటా మోటార్స్ (1.13 శాతం), ఎస్ బ్యాంక్ (1.04 శాతం) కంపెనీల షేర్లు లాభాలను సంపాదించాయి. ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతీ, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్ షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్ స్టాక్స్ అత్యధికంగా 3.54 శాతం నష్టపోయాయి. బ్రిటానియా (2.89 శాతం), టెక్ మహీంద్ర (2.61 శాతం), అదానీ పోర్ట్స్ (2.02 శాతం), హెచ్‌యూఎల్ (1.91 శాతం) షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. కాగా, ఇండియా బుల్స్ షేర్లు 4.15 శాతం లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్ (2.64 శాతం), ఎన్‌టీపీసీ (2.07 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.82 శాతం), ఎస్ బ్యాంక్ (1.18 శాతం) స్టాక్స్ కూడా లాభాల్లో ముగిశాయి. ఇలావుంటే, ఆసియా, కోస్పీ, హాంగ్ సెంగ్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చైనా, జపాన్ మార్కెట్లకు శుక్రవారం సెలవుదినం కావడంతో, లావాదేవీలు జరగలేదు.