బిజినెస్

రూ. 700 కోట్లతో ఇంటర్‌గ్లోబ్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆతిథ్య రంగంలో పేరుమోసిన అకార్ హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, సుమారు 700 కోట్ల రూపాయలతో విస్తరణకు ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. 2022 సంవత్సరంలోగా దేశంలో మరో ఆరు హోటళ్లను నిర్మించడమే లక్ష్యంగా ఎంచుకుంది. ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ కంపెనీ ఆధ్వర్యంలో, దేశ వ్యాప్తంగా ‘ఐబీఐఎస్’ బ్రాండ్ పేరుతో మొత్తం 19 హోటళ్లు ఉన్నాయి. అన్ని హోటళ్లలో కలిపి 3,559 గదులను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతున్నది. ఆతిథ్య రంగానికి దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉందని, ఈ ఉద్దేశంతోనే మార్కెట్‌లో తమ వాటాను విస్తరించుకుంటామని ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ సంస్థ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేబీ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. కొత్త హోటళ్లను బెంగళూరు, ముంబయి, థానే, గోవా నగరాల్లో నిర్మిస్తామని తెలిపారు. తాము నిర్మించబోయే ఆరు హోటళ్లలో 980 గదులు ఉంటాయన్నారు. ఇప్పటికే ఐబీఐఎస్‌లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు సింగ్ తెలిపారు. విస్తరణపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, పెట్టుబడుల కోసం తమ వద్ద ఏటా కనీసం 200 ప్రతిపాదనలు వస్తాయని సింగ్ అన్నారు. అయితే, అన్ని రకాలుగా అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను నిర్ధారించుకున్న తర్వాతే ఎక్కడ పెట్టుబడులు ఉంచాలనే విషయంపై పాలక మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. విస్తరణకయ్యే ఖర్చులో కొంత భాగం అప్పుల రూపంలో, మరికొంత భాగం పబ్లిక్ ఇష్యూ రూపంలో సమకూర్చుకుంటామని చెప్పారు. ఈక్విటీ షేర్ల ద్వారా 50 శాతం పెట్టుబడి వస్తుందని, మిగతా 50 శాతం మొత్తం రుణాల రూపంలో తీసుకుంటామని సింగ్ వివరించారు. ఆతిథ్య రంగానికి దేశంలో విస్తృతమైన మార్కెట్ ఉందని, ఏ స్థాయి వరకైనా విస్తరించుకోవచ్చని సింగ్ వ్యాఖ్యానించారు.