బిజినెస్

గ్రీన్ సర్ట్ఫికెట్స్ అమ్మకాలు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: గ్రీన్ సర్ట్ఫికెట్స్ అమ్మకాలు దారుణంగా పడిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రీన్ సర్ట్ఫికెట్ల అమ్మకాలు 65 శాతం పతనమయ్యాయి. పురుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజ్ (ఐఈఎక్స్), పవర్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ ఇండియా (పీఎక్స్‌ఐఎల్) సంయుక్తంగా రిన్యువబుల్ ఎనర్జీ సర్ట్ఫికెట్స్ (ఆర్‌ఈసీ), విద్యుత్ అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి కారణంగా పర్యావరణం దెబ్బతింటున్నదని, జల, వాయు కాలుష్యం పెరిగిపోతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాబోయే సమస్యను దృష్టిలో ఉంచుకొని, గాలి, నీరు, జంతు వ్యర్థాలు వంటి పురుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారు చేయడాన్ని ఐఈఎక్స్, పీఎక్స్‌ఐఎల్ ప్రోత్సహిస్తున్నాయి. సాంప్రదాయేతర, పునరుద్పాక మార్గాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ప్రీ పెయిడ్ విధానంలో గ్రీన్ సర్ట్ఫికెట్స్‌గా వ్యవహరించే ఆర్‌ఈసీలను విక్రయిస్తున్నాయి. ఆర్‌ఈసీల ట్రేడింగ్ ప్రతినెలా చివరి బుధవారం రోజున జరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం, ఏప్రిల్ మాసంలో, ఐఈఎక్స్‌లో 2.24 లక్షల గ్రీన్ సర్ట్ఫికెట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ఇది 7.81 లక్షలు కావడం గమనార్హం. ఐఈఎక్స్ ద్వారా 1,61,949 యూనిట్ల నాన్ సోలార్ ఆర్‌ఈసీలు ట్రేడయ్యాయి. 3,51,915 యూనిట్లు అమ్మకాలు, 6,97,502 యూనిట్ల కొనుగోలు నమోదయ్యాయి. 62,853 సోలార్ యూనిట్లు ట్రేడయ్యాయి. అమ్మకం బిడ్స్ 1,42,148 యూనిట్లుకాగా, కొనుగోలు బిడ్స్ 3,61,606 యూనిట్లు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడంతో, చాలా మంది గ్రీన్ సర్ట్ఫికెట్లవైపు మొగ్గు చూపడం లేదు.
ఇలావుంటే, పునరుత్పాదక మార్గాల్లో ఉత్పత్తయిన విద్యుత్ సరఫరాకు ప్రత్యేక సౌకర్యాలు లేవు. ఫలితంగా సంప్రదాయ విధానాల్లో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ పంపిణీతోనే సంప్రదాయేతర విద్యుత్ సరఫరా కూడా జరుగుతున్నది. అంటే, ఒక వినియోగదారుడు ఎంత మేరకు సంప్రదాయ విద్యుత్‌ను, ఎంత మేరకు సంప్రదాయేతర విద్యుత్‌ను వాడాడో తెలుసుకునే అవకాశమే లేదు. సాధారణ విద్యుత్ పంపిణీ కేంద్రాలకు ఎంత మొత్తం సాంప్రదాయేతర విద్యుత్‌ను పంపాం? ఆ నెలలో ఇంకా ఎంత మొత్తం మిగిలి ఉంది? అనేది లెక్కిస్తారు. తద్వారా పునరుత్పాదక విధానాల్లో తయారైన విద్యుత్‌ను ఎంత మేరకు పంపిణీ జరిగిందనేది తెలుసుకుంటారు. సోలార్‌సహా సాంప్రదాయేతర లేదా పునరుత్పాదక మార్గాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్ సరఫరా చాలా తక్కువగా ఉండడం, డిమాండ్‌తో ఏమాత్రం పొంతన లేకపోవడంతో గ్రీన్ సర్ట్ఫికెట్ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. పైగా, ఈ సర్ట్ఫికెట్లపై ప్రజలకు సరైన అవగాహన కూడా కల్పించడం లేదన్నది వాస్తవం. అందుకే, గ్రీన్ సర్ట్ఫికెట్ల అమ్మకాలు రోజురోజుకూ పతనమవుతున్నాయి.