బిజినెస్

మార్కెట్‌లో అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: స్టాక్ మార్కెట్‌లో ఈ వారం అనిశ్చితి పరిస్థితి కొనసాగింది. కేవలం మూడురోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈవారంలో మొత్తం 104.07 సెనె్సక్ పతనమయ్యాయి. 29,067.33 సెనె్సక్స్ పాయింట్లతో ప్రారంభమైన బీఎస్‌ఈ ట్రేడింగ్ మంగళవారం 39,031.55 పాయింట్లతో పతనమైంది. మహారాష్ట్ర ఎన్నికల కారణంగా సోమవారం స్టాక్‌మార్కెట్ సెలవుదినం కావడంతో మంగళవారంనాటి ట్రేడింగ్ లాభాల్లో నడుస్తుందని మదుపరులు ఆశించారు. ప్రారంభంలో సెనె్సక్స్ సూచి లాభాల బాటలోనే నడిచింది. అయితే, అంతర్జాతీయ ట్రేడింగ్ సూచీలు నష్టాలను ఎదుర్కోవడంతో భారత స్టాక్‌మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. బుధవారం తిరిగి సెలవుదినం కాగా, గురు, శుక్రవారాల్లో ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ముగిసింది. గురువారం సెనె్సక్స్ 50.12 పాయింట్లు తగ్గడంతో 38,981.43 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆ మరుచటిరోజు, స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలకు చివరిరోజైన శుక్రవారం మరోసారి సెనె్సక్స్ పతనం తప్పలేదు. నిజానికి అత్యంత ఆశాజనకంగా ప్రారంభమైన ట్రేడింగ్ చివరిక్షణంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. దేశీయ మదుపరులు ఆదుకోవడంతో కొంత ఊపిరిపీల్చుకున్న సెనె్సక్స్ చివరకు 18.12 పాయింట్ల నష్టంతో ముగిసింది. సోమవారం 38,963.26 పాయింట్లతో ప్రారంభమయ్యే బీఎస్‌ఈ ఏ రకంగా ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.