తెలంగాణ

మాఫీ లేదు.. రుణాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: త్వరలో ఖరీఫ్ మొదలవుతున్నా పంటను ఆదుకునేందుకు రుణాలు ఇవ్వడం లేదు, రుణ మాఫీ జరగడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జూన్ నుండి ఖరీఫ్ పంట ప్రారంభం అవుతుందని, పెట్టుబడులు రైతులకు అత్యంత అవసరమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లక్షలోపు రుణాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడమేగాక, ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు వేల కోట్ల రూపాయిలను కేటాయించారని తమ్మినేని గుర్తుచేశారు. అయినా రుణమాఫీ అమలుకాకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని చెప్పారు. తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి, బ్యాంకుల నుండి పంటరుణాలను ఇప్పించాలని ఆయన కోరారు. ఒక్కో రైతుకు లక్ష రూపాయిల రుణమాఫీ చేయడంతో పాటు 24వేల కోట్లు మేర 2019-20 సంవత్సరంలో మాఫీ చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరువేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఈసారి కూడా నాలుగు వార్షిక విడతలుగా మాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మొత్తం రుణమాఫీని ప్రభుత్వం తన ఖాతాలోకి మార్చుకుని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాలని పేర్కొన్నారు. అంతే తప్ప రైతుల పేరుతో బకాయిలు పెట్టరాదని, గత అనుభవాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన 16,165 కోట్లలో 4వేల కోట్లకు పైగా రైతులు వడ్డీ కిందనే నష్టపోయారని ,ఇపుడూ అదే జరగబోతోందని అన్నారు. రైతుల పేరుతో అప్పు ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని, 2018-19లో 42వేల కోట్ల పంటల రుణ ప్రణాళికలో 31వేల కోట్లు మాత్రమే ఇచ్చినట్టు ప్రకటించాయని, ఇందులో కూడా 50 శాతం బుక్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా మార్పు జరిగిందని, అందువల్ల రుణం కోసం రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారులపై ఆధారపడి 20వేల కోట్లకు పైగా అధిక వడ్డీకి అప్పులు తెచ్చారని, పంటలు దెబ్బతినడం, పంటలకు ధర రాకపోవడం ఫలితంగా రుణ గ్రస్తులైన రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటునే ఉన్నారని అన్నారు.