బిజినెస్

తపాలా కార్యాలయాల ఆధునీకరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: దేశంలోని 1.5 లక్షల తపాలా కార్యాలయాల నెట్‌వర్క్ ఆధునీకరణకు దోహదం చేసే ఓ సమగ్ర పరిష్కారం (ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్)ను రూపొందించి, మోహరింపజేశామని అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల ప్రకటించింది. ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థ తమకు సమాచార ఆధునీకరణ కార్యక్రమానికి చెందిన రూ.1,100 కోట్ల విలువైన బహుళ సంవత్సర కాంట్రాక్టు కేంద్ర తపాలా శాఖ నుంచి వస్తుందని 2013లో ప్రకటించడం జరిగింది. తపాలా కార్యాలయాల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు, సిస్టంలను అమర్చడం ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలను అందించాలని అప్పట్లో ఇరు సంస్థల నడుమ ఒప్పందం కుదిరింది. కాగా దీని అమలులో అత్యంత కీలకమైన ‘కోర్ సిస్టం ఇంటెగ్రేషన్’ (సీఎస్‌ఐ) కార్యక్రమాన్ని టీసీఎస్ విజయవంతంగా డిజైన్ చేసి అమలు చేసింది. ఒక సమగ్ర ఈఆర్పీ సొల్యూషన్‌ను అన్ని తపాలా కార్యాలయాలకు మోహరింపజేయడం జరిగింది. తద్వారా మెయిల్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్ వ్యవహారాలతోబాటు, మానవ వనరులకు విభాగానికి చెందిన పనులు సజావుగా, వేగవంతంగా సాగడంతోబాటు 1.5 లక్షల తపాలా కార్యాలయాలకు అనుసంధానమై పనిచేస్తుంది. దీంతోప్రపంచంలోనే అతిపెద్ద ఈ-పోస్టల్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్‌గా మన తపాలా శాఖ అవతరించిందని టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక ఈ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ద్వారా రోజుకు మూడు మిలియన్ తపాలా లావాదేవీలు జరిగి ఐదు లక్షల మంది ఉద్యోగులు, 40వేల కౌంటర్ల ద్వారా వినియోగదారులు లబ్ధిపొందుతారని టీసీఎస్ తెలిపింది. దేశంలోని 24వేల తపాలా కార్యాలయాల్లోని 80 వేల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినళ్ల ద్వారా పీవోఎస్‌ను అమలు చేశామని, అంతేగాక కన్సైనె్మంట్ ట్రాకింక్ సామర్ధ్యాలతో ఓ వెబ్‌పోర్టల్‌ను కూడా రూపొందించడం జరిగిందని, అలాగే ఒక బహుళ భాషా కాల్‌సెంటర్‌ను వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఏర్పాటు చేశామని టీసీఎస్ ఈ సందర్భంగా వివరించింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తపాలా శాఖకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పౌర సేవలు అందుబాటులోకి తేవాలన్నదే ఈ కీలక మార్పులోని ముఖ్య ఉద్దేశమని, దీని ద్వారా ‘దర్పణ్-1’ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న 1.3 లక్షల గ్రామీణ డాక్ సేవక్‌లు చేతి డివైస్‌లతో పోస్టల్, బ్యాంకింగ్, బీమా, నగదు ఆధారిత సేవలను నెట్‌వర్క్ సౌకర్యం లేకపోయినా అందజేసేందుకు వీలు కలిగిందని టీసీఎస్ వాణిజ్య గ్రూప్ హెడ్ దేబశిష్ ఘోష్ తెలిపారు. ఈ తరహా డిజిటల్ తపాలా సేవలను ఇతర ప్రపంచ దేశాలు సైతం అనుసరించే అవకాశాలున్నాయన్నారు.