బిజినెస్

ఈ వారమూ అనిశ్చితే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా అనిశ్చిత పరిస్థితిలోనే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా నమోదు కావడంతోపాటు రూపాయి మారకం విలువ పతనం, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత వారం కేవలం మూడు రోజుల లావాదేవీలు సాధ్యం కాగా, బీఎస్‌ఈలో సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. దేశీయ మదుపరులు మద్దతు ఇచ్చినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్రేడింగ్ జరిగిన మూడు రోజుల్లోనూ ఇంట్రాడే లావాదేవీలు ఒక దశలో అత్యధికంగా, మరో దశలో అత్యల్పంగా నమోదయ్యాయి. మార్కెట్ స్థిరంగా ముందుకు సాగడం లేదనడానికి ఇదో ఉదాహరణ. వివిధ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు వేగంగా కదులుతున్నాయి. ఈ చలనం కొన్ని సమయాల్లో సూచీలను పెంచితే, మరికొన్ని సమయాల్లో సూచీల పతనానికి కారణం అవుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి ఎంత ఉంటుంది అన్న అంశంపై సోమవారం ప్రారంభం కానున్న కొత్త వారంలో ట్రేడింగ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు కూడా వచ్చే వారమే తెలుస్తుంది. కాబట్టి ఈ ఫలితాలు వచ్చేవరకు మార్కెట్ అనిశ్చితి తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, వేదాంత వంటి సంస్థల నికర లాభం ఏమేరకు ఉంటుంది అనేది కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.