తెలంగాణ

ఇంటర్ విద్యార్థుల సమస్యలను కేంద్రానికి వివరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి తెలియచేస్తామని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. భువనగిరి వద్ద నాగినేని పల్లి గ్రామంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిలానన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆకారపు మితి అనే విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనరంతరం బొమ్మలరామారం వద్ద హాజీపూర్ గ్రామంలో హంతకుడు శ్రీనివాసరెడ్డి చేతిలో బలైన ముగ్గురు అమ్మాయిల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను సరిదిద్దడంలో, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంతవరకు ఇంటర్ బోర్డు వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పక్షాన బీజేపీ నిలబడి న్యాయం కోసం పోరాడుతుందన్నారు.విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల కుటుంబాలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హాజీపూర్ గ్రామంలో ముగ్గురు విద్యార్థినులను అతికిరాతకంగా హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు.