తెలంగాణ

యాదాద్రిపై వైభవంగా.. అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మే 6: యాదగిరిగుట్టలో రెండు ఎకరాల విస్తీర్ణంలో విశ్వశాంతి కోసం అఖండ నామ ఆశ్రమాన్ని నెలకొల్పి భక్తులకు శాంతి బోధలతో పాటు గీతా పారాయణం చేయిస్తూ ప్రజలను భక్తి మార్గంలో తీసుకెళుతూ ఆశ్రమం ప్రాంగణంలో 108 హోమగుండాలతో 108 పీఠాధిపతులు, మఠాధిపతులతో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞం చేయాలనుకుంటే ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించడం హేయమైన చర్య అని ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న దాస్ త్రిశూలం స్వామి అన్నారు. సోమవారం యాదగిరిపల్లిలోని రాధాకృష్ణ జగన్నాథ మందిరం ప్రాంగణంలో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞం రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిశూలం స్వామీజీ మాట్లాడుతూ విశ్వశాంతి కోసం పీఠాధిపతులు, మఠాధిపతుల, స్వామీజీలు ఎన్నో పూజలు నిర్వహిస్తుంటారని అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని తరతరాలు గుర్తుంచుకునే విధంగా దేవాలయాన్ని పునః ప్రతిష్ఠ చేయడం అభినందనీయమని దైవసంకల్పం ఉంటే తప్ప ఇంతటి కార్యం చేసేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం చుట్టుపక్కల ఆశ్రమాలు ఉండడం మంచి పరిణామమని ఆశ్రమాలతో ప్రజల్లో భక్తి మార్గం ఏర్పడుతుందని అన్నారు. రెండున్నర ఎకరాలలో 1995లో రాధాకృష్ణ జగన్నాథ ఆశ్రమం కోసం అఖండ నామ ఆశ్రమాన్ని నెలకొల్పి నిత్యం హరే రామ హరే కృష్ణ నామ స్మరణతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆశ్రమాన్ని రోడ్డు వెడల్పులో తొలగిస్తామని అనడమే కాకుండా అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞాన్ని 108 హోమగుండాలతో 108 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంటే రాత్రికి రాత్రి వాటిని తొలగించివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నమ్మకం ఉందని ఇక్కడి వారే కుయుక్తులతో వాటిని తొలగించారని అన్నారు. ఆశ్రమాలను తొలగించి రోడ్డు వేద్దామనుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదని అన్నారు. ఈ చర్యపై పీఠాధిపతులు, మఠాధిపతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞాన్ని ఉదయం నుంచి గోవు పూజా,శ్రీ కృష్ణ బలరాముల స్త్రోత్రం, గీతా పారాయణం, సాయంత్రం యాదాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణం కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగమ్ మహారాజ్ స్వామీజీ, రాజయ్య స్వామీజీ, గీతానంద స్వామీజీ, దత్తగురు స్వామీజీ, శాంతానంద స్వామీజీ, నిరంజన్ దాస్ స్వామీజీ, ఓం మాతాజీ, పద్మజా నంద మాతాజీ, రుక్మీణి మాతాజీ, ప్రజ్ఞానంద మాతాజీ, శారదానంద మాతాజీ, మార్కండేయ మాతాజీ పాల్గొన్నారు.
చిత్రం... రాధాకృష్ణ జగన్నాథ ఆశ్రమంలో హోమం నిర్వహిస్తున్న పీఠాధిపతులు, మఠాధిపతులు