తెలంగాణ

పార్టీ మారిన ఎమ్మెల్యేలను తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు తరమి కొట్టాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం రావడం వల్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జనం తిరగబడుతున్నారని అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌పై ప్రజలు చెప్పులతో దాడి చేశారన్నారు. ఇది ప్రజల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనే కాకుండా వారిని పార్టీలో చేర్చుకున్న పార్టీ నేతలపై కూడా ప్రజలు తిరగబడాలని విహెచ్ పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించని సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం రాష్ట్రాల పర్యటనకు వెళ్తారా? అని విహెచ్ మండిపడ్డారు. విద్యార్థుల మరణాల కంటే రాజకీయ పర్యటనలే కేసీఆర్‌కు ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించడం పట్ల విహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ తప్పు చేసినట్టు విచారణ నివేదికలో బయటపడినా దానిపై చర్య ఎందుకు తీసుకోలేదని విహెచ్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి అవమానపరిచిన విషయాన్ని ఊరూరా తిరిగి ప్రజలకు వివరించనున్నట్టు విహెచ్ తెలిపారు.