తెలంగాణ

శాంతి భద్రతలను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని, శాంతిని భగ్నం చేసే శక్తులపై ఉక్కుపాదం మోపాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర హోంశాఖ మంత్రినికలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన నగరంలో శాంతికి విఘాతం కలిగిస్తూ కొన్ని సంఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. అంబర్‌పేటలో రోడ్డువెడల్పులో ఇంటిని కోల్పోయిన ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నా వివాదాలకు దిగారన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అండదండలతో ఆ స్థలంలో ప్రార్థనలు చేశారన్నారు. నష్టపరిహారం పొందిన స్థలం వక్ఫ్ ఆస్తి అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారు. రోడ్డు వెడల్పు పనులకు మద్దతు ఇస్తున్న స్థానిక ప్రజలు ఈ సంఘటనతో ఆందోళన చేశారన్నారు. ఆందోళనకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం ముక్కుసూటిగా వ్యవహరించాలని, మజ్లిస్ వత్తిళ్లకు లొంగరాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు కోరారు.