తెలంగాణ

ఆస్తి పన్ను వసూళ్లలో 12 మున్సిపాలిటీల రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల మంచి ఫలితాలువస్తున్నాయి. రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు వందకు వంద శాఖ ఆస్తి పన్నును వసూలు చేసి రికార్డు సృష్టించాయి. మరో 25 మున్సిపాలిటీలు 98 శాతం ఆస్తిపన్నును వసూలు చేశాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.453 కోట్ల ఆస్తిపన్నును మున్సిపాలిటీలు వసూలు చేశాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.328 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేశాయి. అంతకుముందు ఏడాదితో పోల్చినప్పుడు, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను వసూళ్ల వృద్ధిరేటు 38.01 శాతం పెరిగింది. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల ఒక్క ఏడాదిలో ఆస్తిపన్ను పద్దు కింద వసూళ్లు అదనంగా రూ.125 కోట్ల మేర పెరిగింది. 2018-19 సంవత్సరంలో రూ.504 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 89 శాతం మేర పన్నులను వసూలు చేశారు.
సూర్యాపేట, పీర్జాదిగూడ, కొత్తగూడెం, సిరిసిల్ల, మెదక్, షాద్‌నగర్, నర్సాపూర్, నగరం, శంషాబాద్, చెన్నూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలైంది. 98 శాతం వరకు పన్నులను వసూలు చేసిన మున్సిపాలిటీల జాబితాలో కామారెడ్డి, సూల్తానాబాద్, ఆదిభొట్ల, కొదాడ, కాగజ్‌నగర్, జగిత్యాల, మిర్యాలగూడ, భైంసా, పాల్వంచ, మధిర, జైపల్లి, బోడుప్పల్, కోరుట్ల, మెట్‌పల్లి, మహబూబ్‌నగర్, ఆమనగల్, నిజామాబాద్, సిద్ధిపేట్, నాగర్‌కర్నూల్, మేడ్చెల్, నల్లగొండ, తాండూర్, పెద్దపల్లి, మంథని, హుజూర్‌నగర్ ఉన్నాయి. 95 శాతం ఆస్తి పన్నును వసూలు చేసిన మున్సిపాలిటీలు మణికొండ, భునవగిరి, జనగాం, ఆదిలాబాద్,కరీంనగర్ నగరపాలక సంస్థ, పరిగి, హుస్నాబాద్, హుజూరాబాద్, ఆర్మూర్, కల్వకుర్తి, బెల్లంపల్లి, హాలియా, జమ్మికుంట, ఆందోల్ జోగిపేట, మీర్‌పేట్, లక్సెట్టిపేట్, గుండ్లపోచంపల్లి, మరిపెడ, మందమర్రి, దమ్మాయిగూడ, తూంకుంట, నర్సంపేట్, రామగుండం నగర పాలక సంస్థ, మంచిర్యాల ఉన్నాయి. మరో 35 మున్సిపాలిటీల్లో పన్ను 85 నుంచి 93 శాతం మధ్య వసూలైందని, గత ఏడాది కొత్త గా ఏర్పాటు చేసిన 72 మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను రూ.72 కోట్లు వసూలైంది. ఆస్తిపన్ను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వసూలు కావడంతో, వచ్చే బడ్జెట్ తర్వాత వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.