తెలంగాణ

ఇంటర్ విద్యలో సమూల మార్పులు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: రాష్ట్రంలోని ఇంటర్ విద్యలో సమూల మార్పులు చేయాల్సిందేనని టీ మాస్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఇందుకోసం సామాజిక సంస్థలు, ప్రజా సంస్థలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన సూచించారు. మంగళవారం నాడు కంచె ఐలయ్య, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆర్ శ్రీరాం నాయక్‌లతో కలిసి దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, కోట రమేష్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం విప్లవ్ కుమార్, ఎ విజయ్‌కుమార్‌లను వారు పరామర్శించారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలతో ఇంటర్ విద్య పెద్ద సంక్షోభంలో పడిందని అన్నారు. ఇంటర్ విద్య కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారిందని అన్నారు. లక్షల్లో ఫీజులు కట్టి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మంది విద్యార్థుల బలిదానాలు జరిగాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బలిదానాలు జరుగుతున్నాయని అన్నారు. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని, దాంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో చదివితేనే నాణ్యమైన విద్య అందుతుందనే వాణిజ్య ప్రకటనలతో సామాన్య మధ్య తరగతి తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ను మార్చేశారని మండిపడ్డారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమకు స్తోమతు లేకున్నా అప్పులు చేసి మరీ పిల్లలను ప్రేవేటు కాలేజీల్లో చదివిస్తున్నారని అన్నారు. ఇంటర్ బోర్డును ఎత్తివేసి సీబీఎస్‌ఈ తరహా విధానాన్ని అమలుచేయాలని పేర్కొన్నారు. దీని కోసం టీ మాస్ ఆధ్వర్యంలో అన్ని సామాజిక ప్రజా , విద్యార్థి, యువజన సంఘాలతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు.