తెలంగాణ

కన్న తల్లి చనిపోయినా.. కడసారి చూపునకు పంపలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 8: కన్నతల్లి చచ్చిపోయినా కడసారి చూపుకు పంపించలే.. భార్య అచేతనావస్థలో ఆసుపత్రిపాలైందన్నా పట్టించుకోలే, బతుకుదెరువు కోసం అబుదాబీ వచ్చి రెండేళ్లవుతుంది. నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంతకంటే నరకం మరెవరూ అనుభవించరేమో? స్వదేశానికి వచ్చేట్టు చూడండి సార్ అంటూ సోషల్ మీడియాలో తెలు‘గోడు’కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం అబుదాబి వెళ్లాడు. అబుదాబికి 20 కిలోమీటర్ల దూరంలో ఒంటెలు కాసేందుకు పనిలో పెట్టారు. వంద ఒంటెలను వీరయ్య ఒక్కడే కాస్తున్నాడు. అక్కడ ఒంటెలు కాసేందుకు పనికి పెట్టుకున్న యజమాని చేతిలో నరకం అనుభవిస్తున్నాడు. తన గోడును ఓ వీడియో ద్వారా వ్యక్తపర్చాడు. మాది పేద కుటుంబం అబుదాబి వచ్చి రెండేళ్లుగా ఒంటెలు కాస్తున్నాను. వాటిని నేనొక్కడినే చూసుకోవాలి. ఒక్క ఒంటె చనిపోతే మా యజమాని నన్ను ఇష్టానుసారంగా చావబాదాడు. దవడలు కూడా ఊడిపోయాయి. మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. నేను ఉండే ప్రాంతంలో కరెంటు కూడా లేదు. సద్ది తెచ్చి ఇచ్చేవాళ్లు లేరు. పని అంతా అయ్యాక కట్టెల పొయ్యిపైనే వంట చేసుకోవాలి. ఇంత పని చేసినా మా యజమాని మాకు జీతం ఇవ్వడు. జీతం అడిగితే తిండి పెట్టకుండా హింసిస్తున్నాడు. నవమాసాలు మోసి కన్న తల్లి చనిపోయినా కడసారి చూపునకు కూడా పంపించలేదు. నా భార్య అచేతనావస్థలో ఆసుపత్రి పాలైనా పంపించడం లేదు. దయచేసి నన్ను ఎలాగైనా ఇండియాకు తీసుకుపోండి సార్ అని ప్రాధేయపడుతూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వారు వెంటనే యుఏఈ భారత రాయబారి నవదీప్ సూరీ, రియాద్‌లోని ఎంబసీతో మాట్లాడి బాధితున్ని భారత్‌కు రప్పించే యత్నాలు ముమ్మరం చేశారు.