తెలంగాణ

ప్రగతిని నిర్దేశించేది ఓటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 8: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిదని, పాలకులు, ప్రగతిని నిర్దేశించేది ఓటుహక్కుతోనేనని, అదే ఓటుతో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికే స్ఫూర్తిగా నిలిపామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట మండలంలోని బాలెంల, లక్ష్మీనాయక్‌తండా, ఎర్కారం, టేకుమట్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుతోనే అభివృద్ధిని నిర్దేశిస్తామని, 2014లో రాష్ట్ర ప్రజలు వివేకంతో వేసిన ఆ ఓటు వల్లే రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడ్డాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలవుతున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలకు బీజం వేసింది ఆ ఓట్ల చలువతోనేనన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సాధించిన కేసీఆర్‌పై విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో అధికారం చేపట్టి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించడం వల్లే ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు, వృద్ధులు. వికలాంగులకు పెన్షన్లు అందుతున్నాయన్నారు. రెండవసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు వచ్చే నెల నుండి దివ్యాంగులకు నెలకు రూ. 3,116, ఒంటరి మహిళలు, వృద్ధులకు రూ.2,116 చొప్పున అందించనున్నామన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమాలను సమ ఫలాల్లో అందించే టీఆర్‌ఎస్ పార్టీకే వేసి మరోమారు ఆదరిస్తే గ్రామాలు మరింత త్వరితంగా అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుందన్నారు. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ప్రాదేశిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇంటిపార్టీగా రూపాంతరం చెందిన టీఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, జడ్పీటీసీ అభ్యర్ధి జీడి భిక్షంలతో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్ధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చిత్రం... సూర్యాపేట మండలం ఎర్కారంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి