బిజినెస్

పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: తెలంగాణ పరిశ్రమల రంగానికి మహర్దశపట్టింది. పెట్టుబడుల వెల్లువ నిరాటంకంగా కొనసాగుతోంది. టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం సూపర్ హిట్టయింది. గత ఐదేళ్లలో టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. టీఎస్ ఐపాస్‌ను కేసీఆర్ సర్కార్ 2015 జనవరి 1వ తేదీన ఆవిష్కరించింది. అప్పటి నుంచి 2019 ఏప్రిల్ వరకు రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు కొత్త పరిశ్రమలు పదివేలు వచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇంతవరకు 9786 పరిశ్రమలు పెట్టుబడులకు ముందుకు రాగా, అందులో 6783 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 640 పరిశ్రమలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఇందులో 2024 పరిశ్రమలు ఇంజనీరింగ్ సెక్టార్‌లో వచ్చాయి. 1522 పరిశ్రమలు ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో ఏర్పాటు చేశారు. అలాగే దాదాపు 700 ఫార్మా పరిశ్రమలు, కెమికల్ పరిశ్రమలు వచ్యా. వ్యవసాయ ఆధారిత శీతల గిడ్డంగులు 998 వచ్చాయి. గ్రానైట్ స్టోన్ క్రషింగ్ పరిశ్రమలు 835 ఏర్పాటు చేవారు. 375 ప్రింటింగ్ పరిశ్రమలు, 745 రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 200 వరకు సోలార్, సంప్రదాయేతర ఇంధన వనరులు, 150 వరకు రియాల్టీ, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ బిల్డింగ్‌లను ఐర్పాటు చేశారు.
కొత్తపరిశ్రమలు రెండేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన మేడ్చెల్ మల్కాజగిరి జిల్లాలో ఏర్పాటు కావడం విశేషం. ఈ జిల్లాలో దాదాపు 2500 పరిశ్రమలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 800, రంగారెడ్డిలో 825 పరిశ్రమలను ఏర్పాటు చేశారు.
పెట్టుబడులను వర్గీకరిస్తే పరిశ్రమల రంగంలో రూ.75,250వేల కోట్లతో 6783పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, దీని వల్ల 5లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. రూ.22,244 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన పరిశ్రమలు అడ్వాన్స్‌డ్ స్టేజీలో ఉన్నాయి. వీటి వల్ల 1.98లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రాథమిక దశలో 616 పరిశ్రమల నిర్మాణం ఉంది. ఈ పరిశ్రమల్లోకి రూ.456,636 కోట్ల పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది. దాదాపు 2.59లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మరో 1758 పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిల్లోకి రూ.17362కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 1.88లక్షల మందికి ఉపాధి లభించనుంది.
ఇటీవల రాష్ట్ర ఐటి రంగం ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. 2018-19లో ఈ రికార్డును తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. గత ఏడాదితో పోల్చితే ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 17 శాతం నమోదైంది. 2018-19లో రూ.1.09 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తే, అంతకు ముందు ఏడాది రూ.93,422వేల కోట్ల టర్నోవర్ నమోదైంది.