తెలంగాణ

గుండె తరుక్కుపోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: హైదరాబాద్‌లోని (ఎర్రగడ్డ) టీబీ లేదా ఛాతీ వ్యాధుల (చెస్ట్ హాస్పిటల్) దవాఖానా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. టీబీ చికిత్సకోసం ఈ దవాఖానా రాష్ట్రం మొత్తంలో అత్యుత్తమమైందిగా పేరు తెచ్చుకుంది. 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దవాఖానాపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనిపిస్తోంది. మొదట 670 బెడ్లతో ఏర్పాటైన ఛాతీవ్యాధుల దవాఖానాలో నేడు బెడ్ల సంఖ్య 400 కు తగ్గిపోయింది. వాస్తవంగా ఏ దవాఖానాలో అయినా బెడ్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు. ఛాతీ వ్యాధుల దవాఖానాలో మాత్రం బెడ్ల సంఖ్య తగ్గింది. 1888 లో ఆరవ నిజాం అయిన నిజాముద్దీన్ ‘ఇర్రనుమ ప్యాలేస్’ పేరుతో భవనం నిర్మించారు. ఈ భవనాన్ని దవాఖానాకు ఏడో నిజాం దానం చేశారు. 1994 లో ప్రభుత్వం ఈ భవనంలో చెస్ట్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది. ఇదే భవనంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆసుపుత్రి నడిచింది. ఆరో నిజాం నిర్మించిన ఇర్రనుమా ప్యాలేస్‌లో 670 బెడ్లను నడుపుతూ వచ్చారు. నాలుగైదు ఏళ్ల క్రిత వరకు డాక్టర్లు, ప్యారామెడికల్ సిబ్బంది, రోగులు, రోగుల బంధువులో ఈ భవనం కిటకిట లాడేది. ఈ భవనం కూలిపోయేదశలో ఉందన్న కారణంతో ఇన్‌పేషంట్ వార్డుతో సహా ఈ భవనంలో ఉన్న ఇతర వైద్య విభాగాలను ఖాళీ చేయించారు. 65 ఎకరాల విశాలమైన స్థలం ఉన్నప్పటికీ, ఈ దవాఖానాకు అవసరమైన కొత్త భవనాన్ని కట్టలేదు. ఒక భవనం కట్టినప్పటికీ, అందులో రెండు వందల బెడ్లకు మించి ఏర్పాటు చేసేందుకు వీలుకానప్పటికీ, 400 బెడ్లను ఏర్పాటు చేశారు. చెస్ట్ ఆసుపత్రికి భవన సదుపాయాలు ఏవీ లేకపోవడంతో చికిత్స కూడా ఇబ్బంది అవుతోంది. చెస్ట్ ఆసుపత్రిలో నాలుగు యూనిట్లు ఉండగా, ఒక యూనిట్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగతా నాలుగు యూనిట్లలో 15 మంది స్పెషలిస్టులు ఉండాల్సినప్పటికీ, నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. వైద్య విద్యలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే ప్రస్తుతం ఈ దవాఖానాకు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నారు. బెడ్ల సంఖ్య తగ్గిపోవడంతో రోగులు కూడా అవసరమైన చికిత్స అందక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ దవాఖానను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ‘జనరల్ మరియు ఛాతీ వ్యాదుల దవాఖానా’గా మార్చారు. ‘నామ్‌కే వాస్తే’గా పేరు మారింది. చెస్ట్ ఆసుపత్రి ఉన్న స్థలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపాదనను చేశారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన కనుమరుగైంది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెస్ట్ ఆసుపత్రి భవనాన్ని సచివాలయం భవనాల నిర్మాణం కోసం వాడతామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన కూడా కనుమరుగైంది. పాత భవనాన్ని ఆసుపత్రికోసం వినియోగించుకోవద్దని ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ భవనాన్ని వాడటం మానివేశారు. కొత్త భవనం నిర్మించలేదు.
ప్రతిపాదనలపై పరిశీలన
చెస్ట్ ఆసుపత్రికి కొత్త భవనాన్ని కట్టేందుకు, ఆసుపత్రిని అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తాము రూపొందించిన ప్రతిపాదనను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) కి పంపించామన్నారు. డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆసుపత్రిని పరిశీలించారు. ప్రభుత్వానికి డీఎంఈ నివేదిక పంపిస్తారని మహబూబ్ ఖాన్ తెలిపారు.
చిత్రాలు.. ఎర్రగడ్డ లోని టీబీ లేదా ఛాతీ వ్యాధుల దవాఖానా
‘ఇర్రనుమ ప్యాలేస్ * చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ (ఇన్‌సెట్‌లో)