తెలంగాణ

పెరిగిన మధ్యాహ్న భోజన వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: తెలంగాణలో మధ్యాహ్న భోజన వ్యయం ప్రభుత్వంపై మరింత భారం కానుంది. ఇటీవలె కేంద్రం వంట వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద దాదాపు ఏటా మరో 15 కోట్ల అదనపు భారం పడనుంది. తెలంగాణలో 28,621 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకూ 11,95,440 మంది విద్యార్థులు, ఆరో తరగతి నుండి 8వ తరగతి వరకూ 7,18,428 మంది విద్యార్థులు, తొమ్మిది, పది తరగతిలో 4,73,883 విద్యార్థులు లబ్ది పొందుతున్నారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకూ 60 శాతం కేంద్రం , 40 శాతం రాష్ట్రం నిధులను సమకూరుస్తున్నాయి. 9, 10 తరగతుల వారికి మధ్యాహ్న భోజన వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మధ్యాహ్న భోజన వంట ఖర్చులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా పెంచిన వ్యయం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. 1వ తరగతి నుండి ఐదో తరగతి వరకూ వంట ఖర్చును 4 రూపాయిల 13 పైసలు నుండి 4 రూపాయిల 35 పైసలకు, ఆరో తరగతి నుండి 8వ తరగతి వరకూ వంట ఖర్చులను 6 రూపాయిల 18 పైసల నుండి 6 రూపాయిల 51 పైసలకు, 9,10 తరగతుల వారికి వంట ఖర్చును 6 రూపాయిల 18 పైసలు నుండి 6 రూపాయిల 51 పైసలకు పెంచారు. ఈ పెంపు కారణంగా ప్రభుత్వం పై ఏటా ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అదనంగా 5.92 కోట్లు భారం పడుతుంది. 6 నుండి 8వ తరగతి వరకూ 5.33 కోట్ల భారం పడుతుంది. 9, 10 తరగతులకు 3.32 కోట్లు మేర అదనపు భారం పడుతుందని పాఠశాల విద్య సంచాలకుడు డాక్టర్ విజయకుమార్ తెలిపారు.