ఆంధ్రప్రదేశ్‌

వారం రోజుల గడువివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో సాగునీటి సంఘాలు, పంపిణీ, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించేందుకు వారం గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును కోరింది. వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బోసేల్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. సాగునీటి సంఘాలు, పంపిణీ, ప్రాజెక్టు కమిటీల కాలపరిమితి ముగిసి మూడేళ్లయినా ఎన్నికలు జరిపించలేదని పిటీషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ చట్టంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి తగు చర్యలు తీసుకుని తెలియజేస్తామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. ఇందుకోసం తమకు వారం రోజుల గడువు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో ధర్మాసనం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.