తెలంగాణ

వడదెబ్బకు నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 11: వడదె బ్బకు శనివారం ఒక్క రోజే వృద్ధ దంపతులు సహా నలు గురు మృతి చెందారు. ఇందు లో ఒక ఉపాధిహామీ కూలీ కూడా ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వడదెబ్బకు గురై శనివారం మృతి చెందారు. గత వారం రోజులుగా భానుడి ప్ర తాపానికి ఉక్కిరిబిక్కిరైన డొప్ప నరసింహా (80) గత మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యారు. భార్య లక్ష్మమ్మ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్సలు చేసి ఇంటికి పంపించారు. ఎర్రటి ఎండలో ఆసుపత్రి చుట్టు తిరిగిన డొప్ప లక్ష్మమ్మ (70) కూడా వడదెబ్బకు గురైంది. వాంతులు రావడంతో ఆమెను శనివారం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్సలు చేస్తుండగా మృతి చెందారు. భార్య లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న భర్త నరసింహా ఇంటి వద్ద మృతి చెందాడు. వృద్ధ దంపతులు వడదెబ్బకు గురై ఒకేసారి సారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అమ్రాబాద్ మండలంలో...
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన కారంగి సాయిలు (52) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బకు గురై శనివారం మృతి చెందాడు. శుక్రవారం వడదెబ్బ అస్వస్థతగురయ్యాడని, ఆస్పత్రికి తరలించి చికిత్స చేసిన ఫలితం లేకుండా పోయిందని, చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కమాన్‌పూర్ మండలంలో మరో ఇద్దరు..
కమాన్‌పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలో వడదెబ్బతో శనివారం ఇద్దరు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన బుర్ర శ్రీనివాస్ గౌడ్ (38)తోపాటు కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దాసరిపల్లెకు చెందిన దార్ల మొగిలి (60) వడదెబ్బతో మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తన విధుల్లో భాగంగా ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. శుక్రవారం ఎలక్ట్రికల్‌కు సంబంధించిన సామగ్రి కోసం పెద్దపల్లికి వెళ్లి సాయంత్రం వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం అపస్మారక స్థితికి చేరగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. అలాగే మొగిలి భవన నిర్మాణ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై మృతి చెందాడు.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్లి కూలీ జాడి గంగాధర్(35) వడదెబ్బ తగిలి మృతిచెందాడు. కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన వికలాంగుడైన జాడి గంగాధర్ శుక్రవారం ఉపాధిహామీ పథకం పనులకు వెళ్లాడు. ఉపాధి పనులు చేసుకుని ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఉపాధిపనులు చేసిన గంగాధర్‌కు ఎండ తగలడంతో వడదెబ్బకు గురికావడంతో తన ఇంట్లో రాత్రి గంగాధర్ మృతిచెందినట్లు అతని కుటుంబీకులు తెలిపారు. శనివారం ఈజీయస్ అధికారులు, సిబ్బంది, స్థానిక సర్పంచ్ జడ రాజమణి, ఇందూర్ మాజీ సర్పంచ్ ప్రవీన్, బీజేపీ మండల నాయకుడు వెంకటేష్‌లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.
చిత్రం... వడదెబ్బ తగిలి మృతిచెందిన జాడి గంగాధర్