తెలంగాణ

అడవి జంతువుల బారి నుంచి రైతులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతల్లో కోతులు, కొండెంగులు తదితర అడవి జంతువులు రైతు ఆవాసాలతో పాటు పంట పొలాలను సర్వ నాశనం చేస్తన్నాయని, వాటి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం లేఖలోని అంశాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతల్లో కోతులు, కొండెంగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజల, పిల్లలపై దాడులు చేయడంతో గాయాలు కావడంతో పాటు కొంత మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోతకు వచ్చిన వరి, జొన్న, పత్తి, వేరుశనగ పంటలు, పండ్లతోటలపై అడవి జంతువుల స్వైర్య విహారం చేయడంతో గ్రామీణలు భయాందోళనకు గురైతున్నారని అన్నారు. పంటలను నష్టం చేస్తున్నందున ఎకరాకు 40-50 వేల రూపాయలు నష్టపోవడం జరుగుతోందన్నారు. అసలే పంటలకు గిట్టబాటు ధరలు లేకపోవడంతో రైతాంగం ఆర్థికంగా దెబ్బతింటున్నారని ఆయన గుర్తు చేశారు. రైతును రారాజుని చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.