తెలంగాణ

ఈవోడీబీలో అగ్రస్థానం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: సరళీకృత వాణిజ్య విధానాల (ఈవోడీబీ) కింద ఈ ఏడాది అగ్రస్థానం పొందాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వివిధశాఖల్లో సంస్కరణలను వేగవంతం చేసింది. ప్రపంచ బ్యాంకు, డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది సెంటర్ ఉమ్మడిగా ఈవోడీబీ ర్యాంకును ప్రకిటిస్తాయి. ఈవోడీబీలో ర్యాంకు కావాలనుకునే రాష్ట్రాలు జూన్ 15వ తేదీలోపల వివిధ శాఖలో అమలు చేసిన సంస్కరణలపై నివేదికలు పంపించాలని కేంద్రం కోరింది. గడువును 15 రోజుల పాటు పొడిగించడంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల కోడ్ వల్ల గత రెండు నెలలుగా అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈవోడీబీలో ర్యాంకు కావాలన్నా, నివేదికలు పంపాలన్నా, 80 సూచికల్లో నిర్దేశించిన పరిమితులను రాష్ట్రప్రభుత్వం అమలు చేసి ఉండాలి. వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి, అడవవులు, పరిశ్రమలు, విద్యుత్, జీస్‌టీ రంగాల్లో పూర్తి స్థాయి సంస్కరణలను ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంతది. పరిశ్రమల రంగంలో ఫీడ్ బ్యాక్ విభాగంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సంస్కరణలను అమలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. భూమి రికార్డుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం, సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయితీ రాజ్ శాఖ, రెవెన్యూ శాఖల్లో బృహత్తర మైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో కొత్త చట్టాలను కూడా తేనుంది.